పున్నమి ప్రతి నిధి
కల్లూరు సబ్ డివిజన్‌కు కొత్తగా నియమించబడిన ఏసిపి వసుంధర యాదవ్ ఈరోజు సత్తుపల్లిలో అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆమె ఖమ్మం పోలీస్ కమిషనరేట్ కార్యాలయానికి చేరుకుని, పోలీస్ కమిషనర్ సునీల్ దత్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షల సూచకంగా పుష్పగుచ్చం అందజేశారు.
ఈ సందర్భంగా కమిషనర్ సునీల్ దత్ గారు ఆమెకు అభినందనలు తెలియజేస్తూ సబ్ డివిజన్‌లో చట్టం-శాంతి పరిరక్షణ, ప్రజా భద్రత, నేర నియంత్రణలో మరింత కృషి చేయాలని సూచించారు.
వసుంధర యాదవ్ మాట్లాడుతూ ప్రజల నమ్మకం పొందే విధంగా, పారదర్శకతతో పోలీసింగ్ అందిస్తానని తెలిపారు.


