*సచిన్ దత్తత గ్రామం పుట్టంరాజువారి ఖండ్రిగలో తాగునీటి సమస్య పరిష్కరించండి
.సచిన్ దత్తత గ్రామం పుట్టంరాజువారి కండ్రిక లో తాగునీటి సమస్య వెంటాడుతుంది. గత ఏడాది కురిసిన భారీ వర్షాలు, వరదలకు అక్టోబర్ మాసంలో గ్రామానికి తాగునీరు సరఫరా చేసే పైపులైన్లు ధ్వంసమయ్యాయి. అప్పటి నుంచి తాగునీటి సౌకర్యం లేక పుట్టంరాజువారి కండ్రిక వాసులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇదే సమస్యలను అధికారుల దృష్టికి ఎన్నిసార్లు తీసుకెళ్లినా ఫలితం లేదు . దీంతో కొమ్మనేటూరు ఎంపిటిసి గడ్డం సహదేవ్ సమస్యను ఎంపీ గురుమూర్తి దృష్టికి తీసుకు వచ్చారు. కొమ్మనేటూరు పంచాయతీ పరిధిలో ఓ పరిశ్రమ ప్రారంభానికి వచ్చిన ఎంపీ గురుమూర్తి సమస్యను వివరించారు. సుమారు 130 గడప ఉన్న గ్రామంలో ఆరు నెలలుగా తాగునీరు సరఫరా చేయడం లేదని చెప్పారు. దీంతో ఎంపీ గురుమూర్తి సంబంధిత శాఖల అధికారులతో ఫోన్లో మాట్లాడారు. రెండు రోజుల్లో సమస్యను పరిష్కరించి తాగునీరు సరఫరా జరిగేలా చర్యలు తీసుకోవాలని ఎంపీ గురుమూర్తి ఈ సందర్భంగా ఆదేశించారు. దీంతో క్కొమ్మనేటూరు ఎమ్ పి టి సి గడ్డం సహదేవ తో సహా గ్రామస్తులు ఎంపీ గురుమూర్తి కి కృతజ్ఞతలు చెప్పారు.