Friday, 6 February 2026
  • Home  
  • *సంక్షేమ బోర్డును పని చేయించాలి* *నవంబర్ 20న ధర్నాచౌక్‌లో బిల్డింగ్ వర్కర్స్ ధర్నా* *ఎన్‌టీఆర్ జిల్లా సిఐటియు యూనియన్ పిలుపు*
- ఎన్ టి ఆర్ జిల్లా

*సంక్షేమ బోర్డును పని చేయించాలి* *నవంబర్ 20న ధర్నాచౌక్‌లో బిల్డింగ్ వర్కర్స్ ధర్నా* *ఎన్‌టీఆర్ జిల్లా సిఐటియు యూనియన్ పిలుపు*

రాష్ట్ర బిల్డింగ్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డును పనిచేయించి నిలిపి వేసిన సంక్షేమ పథకాలను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ నవంబర్ 20న విజయవాడ అలంకార్ సెంటర్ సమీపంలోని ధర్నాచౌక్‌లో భారీ ధర్నా నిర్వహించనున్నట్లు ఎన్‌టీఆర్ జిల్లా బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ (సిఐటియు) నాయకులు ప్రకటించారు. ఈ మేరకు డాక్టర్ బిఆర్‌ అంబేద్కర్ బిల్డింగ్ & పెయింటింగ్ వర్కర్స్ యూనియన్ నియోజకవర్గ కమిటీ ఆధ్వర్యంలో కరపత్రాలు విడుదల చేశారు. ఈ సందర్భం గా యూనియన్ నాయకులు పతి హరిబాబు, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు కె.గోపాల్ మాట్లాడుతూ వెల్ఫేర్ బోర్డుపై ప్రభుత్వం ఏ విధమైన చర్యలు తీసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సెప్టెంబర్ 15 ధర్నా — అమలు కాని హామీలు సెప్టెంబర్ 15న రాష్ట్ర లేబర్ కమిషనర్ కార్యాలయం వద్ద రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ధర్నా అనంతరం, కమిషనర్ స్వయంగా ధర్నా స్థలానికి వచ్చి వెల్ఫేర్ బోర్డును పనిచేయిస్తా మని, సంక్షేమ పథకాలను పునఃప్రారంభిస్తామని హామీ ఇచ్చారని వారు గుర్తు చేశారు. నెలరోజులు సమయం కోరినప్ప టికీ నేటి వరకూ హామీ అమలు కాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు నవంబర్ 20న రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ల వద్ద ధర్నాలు నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు. 25 లక్షల కార్మికులకు నష్టం రాష్ట్రంలో 25 లక్షలకుపైగా నిర్మాణ కార్మికులు పనిచేస్తుం డగా,వెల్ఫేర్ బోర్డులో 18 లక్షల మంది నమోదు అయినట్టు నాయకులు వివరించారు. 2009 నుంచి 2019 వరకు అనేక సంక్షేమ పథకాలు అమలవుతున్నప్పటికీ, వైఎస్సాఆర్సిపి ప్రభుత్వం జారీ చేసిన మెమో 1214 కారణంగా ఆ పథకాలు పూర్తిగా నిలిచి పోయాయని తెలిపారు. వెల్ఫేర్ బోర్డు ఖాతాల్లో వేల కోట్ల నిధులు ఉన్నప్పటికీ, ఒక్క రూపాయి కూడా కార్మికులకు చేరకపోవడం తీవ్రమైన అన్యాయమని అన్నారు. ఇతర రాష్ట్రాలు అమలు చేస్తున్న పథకాలు కర్ణాటకలో కార్మికుల పిల్లలకు స్కాలర్‌షిప్‌ లు, తమిళనాడులో ప్రమాద మరణాలపై రూ.10 లక్షల పరిహారం, హర్యానాలో మహిళ ల కోసం కుట్టు యంత్రాల పంపిణీ వంటి పథకాలు కొనసాగుతున్నాయని వివరించారు.మన రాష్ట్రంలో మాత్రమే సంక్షేమ పథకాలు నిలిచిపోవడం విచారకరమని విమర్శించారు. టిడిపి హామీ ఏమైంది? ఎన్నికల ముందు వెల్ఫేర్ బోర్డును పునరుద్ధరిస్తామని మ్యానిఫెస్టోలో పేర్కొన్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 18 నెలలు అయినా, ఇప్పటికీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని నాయకులు ఆక్షేపించారు. నానా విన్నపాలు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు చేపట్టకపోవ డం బాధాకరమని తెలిపారు. వెల్ఫేర్ బోర్డు పథకాలు అమలు చేస్తే ప్రభుత్వానికి ఎలాంటి ఆర్థిక భారం ఉండదని, నిర్ణయం తీసుకుంటే లక్షలాది కార్మికులకు మేలు జరుగుతుందని వారు అన్నారు. 20న ధర్నాకు భారీగా తరలిరండి — యూనియన్ పిలుపు మెమో 1214 రద్దు చేయాలని, వెల్ఫేర్ బోర్డును పునరుద్ధరించాలని, సంక్షేమ పథకాలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నవంబర్ 20న జరిగే ధర్నాచౌక్ ధర్నాను విజయం సాధించాల్సి న అవసరం ఉందని నాయకులు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పాల్గొన్న వారు డాక్టర్ బి.ఆర్‌ అంబేద్కర్ పెయింటింగ్ వర్కర్ యూనియన్ నాయకులు గులాయ్ దస్తగిరి బాజి (అధ్యక్షులు), కొరగంటి ఆనందరావు (కోశాధికారి), మందా స్వామి, కమాదుల నాగరాజు (ఉపాధ్యక్షులు), కొండ్ర కోండ రాము, కామా రమేష్ బాబు (సహాయ కార్యదర్శులు),షేక్ అలీల్ పాసా, పుప్పాల లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్ర బిల్డింగ్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డును పనిచేయించి నిలిపి వేసిన సంక్షేమ పథకాలను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ నవంబర్ 20న విజయవాడ అలంకార్ సెంటర్ సమీపంలోని ధర్నాచౌక్‌లో భారీ ధర్నా నిర్వహించనున్నట్లు ఎన్‌టీఆర్ జిల్లా బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ (సిఐటియు) నాయకులు ప్రకటించారు. ఈ మేరకు డాక్టర్ బిఆర్‌ అంబేద్కర్ బిల్డింగ్ & పెయింటింగ్ వర్కర్స్ యూనియన్ నియోజకవర్గ కమిటీ ఆధ్వర్యంలో కరపత్రాలు విడుదల చేశారు. ఈ సందర్భం గా యూనియన్ నాయకులు పతి హరిబాబు, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు కె.గోపాల్ మాట్లాడుతూ వెల్ఫేర్ బోర్డుపై ప్రభుత్వం ఏ విధమైన చర్యలు తీసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సెప్టెంబర్ 15 ధర్నా — అమలు కాని హామీలు
సెప్టెంబర్ 15న రాష్ట్ర లేబర్ కమిషనర్ కార్యాలయం వద్ద రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ధర్నా అనంతరం, కమిషనర్ స్వయంగా ధర్నా స్థలానికి వచ్చి వెల్ఫేర్ బోర్డును పనిచేయిస్తా మని, సంక్షేమ పథకాలను పునఃప్రారంభిస్తామని హామీ ఇచ్చారని వారు గుర్తు చేశారు.
నెలరోజులు సమయం కోరినప్ప టికీ నేటి వరకూ హామీ అమలు కాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు నవంబర్ 20న రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ల వద్ద ధర్నాలు నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు.
25 లక్షల కార్మికులకు నష్టం
రాష్ట్రంలో 25 లక్షలకుపైగా నిర్మాణ కార్మికులు పనిచేస్తుం డగా,వెల్ఫేర్ బోర్డులో 18 లక్షల మంది నమోదు అయినట్టు నాయకులు వివరించారు.
2009 నుంచి 2019 వరకు అనేక సంక్షేమ పథకాలు అమలవుతున్నప్పటికీ, వైఎస్సాఆర్సిపి ప్రభుత్వం జారీ చేసిన మెమో 1214 కారణంగా ఆ పథకాలు పూర్తిగా నిలిచి పోయాయని తెలిపారు.
వెల్ఫేర్ బోర్డు ఖాతాల్లో వేల కోట్ల నిధులు ఉన్నప్పటికీ, ఒక్క రూపాయి కూడా కార్మికులకు చేరకపోవడం తీవ్రమైన అన్యాయమని అన్నారు.
ఇతర రాష్ట్రాలు అమలు చేస్తున్న పథకాలు కర్ణాటకలో కార్మికుల పిల్లలకు స్కాలర్‌షిప్‌ లు, తమిళనాడులో ప్రమాద మరణాలపై రూ.10 లక్షల పరిహారం, హర్యానాలో మహిళ ల కోసం కుట్టు యంత్రాల పంపిణీ వంటి పథకాలు కొనసాగుతున్నాయని వివరించారు.మన రాష్ట్రంలో మాత్రమే సంక్షేమ పథకాలు నిలిచిపోవడం విచారకరమని విమర్శించారు.
టిడిపి హామీ ఏమైంది?
ఎన్నికల ముందు వెల్ఫేర్ బోర్డును పునరుద్ధరిస్తామని మ్యానిఫెస్టోలో పేర్కొన్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 18 నెలలు అయినా, ఇప్పటికీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని నాయకులు ఆక్షేపించారు.
నానా విన్నపాలు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు చేపట్టకపోవ డం బాధాకరమని తెలిపారు.
వెల్ఫేర్ బోర్డు పథకాలు అమలు చేస్తే ప్రభుత్వానికి ఎలాంటి ఆర్థిక భారం ఉండదని, నిర్ణయం తీసుకుంటే లక్షలాది కార్మికులకు మేలు జరుగుతుందని వారు అన్నారు. 20న ధర్నాకు భారీగా తరలిరండి — యూనియన్ పిలుపు మెమో 1214 రద్దు చేయాలని, వెల్ఫేర్ బోర్డును పునరుద్ధరించాలని, సంక్షేమ పథకాలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నవంబర్ 20న జరిగే ధర్నాచౌక్ ధర్నాను విజయం సాధించాల్సి న అవసరం ఉందని నాయకులు పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో పాల్గొన్న వారు
డాక్టర్ బి.ఆర్‌ అంబేద్కర్ పెయింటింగ్ వర్కర్ యూనియన్ నాయకులు
గులాయ్ దస్తగిరి బాజి (అధ్యక్షులు), కొరగంటి ఆనందరావు (కోశాధికారి),
మందా స్వామి, కమాదుల నాగరాజు (ఉపాధ్యక్షులు),
కొండ్ర కోండ రాము, కామా రమేష్ బాబు (సహాయ కార్యదర్శులు),షేక్ అలీల్ పాసా, పుప్పాల లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.