Monday, 30 March 2026
  • Home  
  • సంక్రాంతి స్పెషల్: బీహెచ్‌పీవీ క్రికెట్ టోర్నమెంట్ డ్రా పూర్తి
- విశాఖపట్నం

సంక్రాంతి స్పెషల్: బీహెచ్‌పీవీ క్రికెట్ టోర్నమెంట్ డ్రా పూర్తి

విశాఖ జిల్లా – గాజువాక (పున్నమి ప్రతినిధి): సంక్రాంతి పండుగను పురస్కరించుకుని బీహెచ్‌పీవీ హార్ట్‌ఫుల్ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రెండో సంవత్సరంగా నిర్వహించనున్న బీహెచ్‌పీవీ మాజీ ఉద్యోగుల కుమారుల క్రికెట్ టోర్నమెంట్–2026కు సంబంధించిన డ్రా కార్యక్రమం బీహెచ్‌ఈఎల్ యూనియన్ కార్యాలయంలో ఘనంగా జరిగింది. ఈ టోర్నమెంట్ జనవరి 9, 10, 11, 12 తేదీలలో నిర్వహించనున్నారు. డ్రా కార్యక్రమానికి ప్రముఖ సినీ నటులు, జీవీఎంసీ బ్రాండ్ అంబాసిడర్, స్వచ్ఛ విశాఖ ప్రచారకర్త, ఆంధ్ర విశ్వవిద్యాలయ బోర్డు సభ్యులు ప్రసన్న కుమార్ ముఖ్య అతిథిగా హాజరై డ్రా తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత క్రీడల ద్వారా శారీరకంగా, మానసికంగా మరింత బలపడతారని, ఇలాంటి టోర్నమెంట్లు స్నేహభావాన్ని, క్రీడాస్ఫూర్తిని పెంపొందిస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ నృత్య కళాకారిణి పల్సర్ ఝాన్సీ, రమేష్ మాస్టర్, బీహెచ్‌ఈఎల్ యూనియన్ అధ్యక్షులు బోండా బాబూరావు, టెక్కలి భాస్కర్ రావు పాల్గొని నిర్వాహకులను అభినందించారు. అలాగే ఈ కార్యక్రమంలో జై రాము, ఎం. నాని బాబు, ఎం.ఎన్. కుమార్, పి. శ్రీనివాస్, కె. రవి కుమార్, రాజశేఖర్, సుబేదన్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. టోర్నమెంట్‌ను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.

విశాఖ జిల్లా – గాజువాక (పున్నమి ప్రతినిధి):

సంక్రాంతి పండుగను పురస్కరించుకుని బీహెచ్‌పీవీ హార్ట్‌ఫుల్ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రెండో సంవత్సరంగా నిర్వహించనున్న బీహెచ్‌పీవీ మాజీ ఉద్యోగుల కుమారుల క్రికెట్ టోర్నమెంట్–2026కు సంబంధించిన డ్రా కార్యక్రమం బీహెచ్‌ఈఎల్ యూనియన్ కార్యాలయంలో ఘనంగా జరిగింది. ఈ టోర్నమెంట్ జనవరి 9, 10, 11, 12 తేదీలలో నిర్వహించనున్నారు.
డ్రా కార్యక్రమానికి ప్రముఖ సినీ నటులు, జీవీఎంసీ బ్రాండ్ అంబాసిడర్, స్వచ్ఛ విశాఖ ప్రచారకర్త, ఆంధ్ర విశ్వవిద్యాలయ బోర్డు సభ్యులు ప్రసన్న కుమార్ ముఖ్య అతిథిగా హాజరై డ్రా తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత క్రీడల ద్వారా శారీరకంగా, మానసికంగా మరింత బలపడతారని, ఇలాంటి టోర్నమెంట్లు స్నేహభావాన్ని, క్రీడాస్ఫూర్తిని పెంపొందిస్తాయని అన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రముఖ నృత్య కళాకారిణి పల్సర్ ఝాన్సీ, రమేష్ మాస్టర్, బీహెచ్‌ఈఎల్ యూనియన్ అధ్యక్షులు బోండా బాబూరావు, టెక్కలి భాస్కర్ రావు పాల్గొని నిర్వాహకులను అభినందించారు.
అలాగే ఈ కార్యక్రమంలో జై రాము, ఎం. నాని బాబు, ఎం.ఎన్. కుమార్, పి. శ్రీనివాస్, కె. రవి కుమార్, రాజశేఖర్, సుబేదన్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. టోర్నమెంట్‌ను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.