ఈనెల 12న మాచర్లలో రెండు తెలుగు రాష్ట్రాల స్థాయి సినిమా పాటల పోటీలు
మాచర్లః పల్నాడు జిల్లా మాచర్ల పట్టణంలోని మానుకొండ కళ్యాణ మండపంలో సంక్రాంతి వేడుకలను పురస్కరించుకొని ఈ నెల 12వ తేదీ సాయంత్రం 6 గంటలకు లయన్స్ క్లబ్ ఆఫ్ మాచర్ల చెన్నకేశవ ఆధ్వర్యంలో 23వ తెలుగు రాష్ట్రాల స్థాయి సినిమా పాటల పోటీలు “మనమూ పాడుదాం” అనే కార్యక్రమం నిర్వహించనున్నట్లు లయన్స్ క్లబ్ ఆఫ్ మాచర్ల చెన్నకేశవ అధ్యక్షులు డాక్టర్ గుర్రం రాజశేఖర్ రెడ్డి తెలిపారు.ఈ పోటీలలో గెలుపొందిన విజేతలకు మొదటి బహుమతి రూ.8000 వేలు,రెండవ బహుమతి రూ. 5000 వేలు,మూడవ బహుమతి రూ. 3000 వేలు ఇవికాక మరో పదిమందికి రూ. 500 చొప్పున ప్రోత్సాహక బహుమతులు ఇవ్వనున్నట్లు తెలిపారు.ఈ పోటీలలో పాల్గొనదలచిన గాయనీ గాయకులు 12వ తేదీ సోమవారం ఉదయం 9:30 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటలవరకు జరిగే పరిశీలనలో ఎంపిక అయిన వారు మాత్రమే అదే రోజు సాయంత్రం జరిగే పోటీలకు అర్హులన్నారు.ఈ కార్యక్రమం లయన్స్ జిల్లా సాంస్కృతిక శాఖాధ్యక్షులు డాక్టర్ ముటుకుల కమలాసన్ రావు ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్లు డాక్టర్ రాజశేఖర్ రెడ్డి తెలిపారు. గాయనీ గాయకులకు ఎటువంటి ఎంట్రీ ఫీజు లేదని, వయోభేదం లేదని,ప్రతి పాటకు సంగీత సహకారం ఉంటుందని,
ఉచిత భోజన సదుపాయం కలదని అన్నారు. పూర్తి వివరాలకు డాక్టర్ ముటుకుల కమలాసన్ రావు సెల్ నెంబర్ 9441065681ను సంప్రదించవచ్చన్నారు.

