✍️రెడ్డి సత్య సుబ్రహ్మణ్యం
తూర్పుగోదావరి జిల్లా
పున్నమి సీనియర్ రిపోర్టర్
9989086083.
*మూడు రోజుల సంక్రాంతి పండుగలో మొదటిది భోగి పండుగ (Bhogi 2026)*
*ధనుర్మాసానికి ముగింపు.*
*భక్తి శ్రద్ధలతో ధనుర్మాస వ్రతాన్ని ఆచరించిన గోదా దేవి శ్రీరంగనాథుడి పత్నిగా సౌభాగ్యానికి నోచుకున్న పుణ్య ఘట్టానికి సంకేతమే ఈ భోగి పండుగ (Bhogi Festival 2026).*
*లేమి చీకట్ల నుంచి భోగ వికాసాల్లోకి దారిచూపే ఆ మంటలనే భోగిమంటలు అంటాం.*
*రేపటి రోజు నుంచి ఆరంభమయ్యే ఉత్తరాయణం పుణ్యకాలాన్ని నూతన జీవనానికి ఆహ్వాన చిహ్నంగా భావిస్తాం.*
*మాట ద్వారా మనిషి ఆలోచనలను ఎలా గ్రహించవచ్చో…పండుగల ద్వారా ఒక జాతి ఆచారాలను గ్రహించడానికి పండుగలు అలాగ అనడంలో ఎలాంటి సందేహం లేదు.*
*ప్రతి ప్రాంతంలో పండుగలు జరుపుకునే తీరు ఎన్నో ఆధ్యాత్మిక, ఆచార, సంస్కృతి, సంప్రదాయాలను తెలియజేస్తుంది. కాబట్టే పండుగలను జాతికి జీవనాడిగా చెబుతారు.*
*వాటిని మన సంస్కృతిలో భాగంగా పరిగణిస్తారు. అయితే ఈ పండుగల్లో మనుషులకు మాత్రమే కాదు జంతువులకు, ప్రకృతికి , ఈ సృష్టిలో సమస్త జీవజాలానికి భాగం పంచారు.*
*పశుపక్షాదులు సైతం మానవ పరివారంలో భాగమే అన్నది ఈ పండుగల ద్వారా పెద్దలు మనకందించిన సందేశం.*
*పైన చెప్పిన వాటన్నింటికీ చక్కటి ఉదాహరణ సంక్రాంతి పండుగ (Sankranti 2026).*
END
Uploaded Video:



