-జామియా నూరుల్లా ఇస్లామిక్ ట్రస్ట్ అధ్యక్షుడు ఖారీ అబ్దుల్ సుభాన్
సిద్దవటం ఆగస్టు ( పున్నమి ప్రతినిధి )
ప్రతి మనిషి జీవితంలో భక్తి భావం పెంపొందించుకొని దానం చేసే గుణం అలవర్చుకోవాలని, దానం చేయడం వల్ల పుణ్యం లభిస్తుందని జామియా నూరుల్లా ఇస్లామిక్ ట్రస్ట్ చైర్మన్ ఖారీ అబ్దుల్ సుబాహన్ అన్నారు.శనివారం ఒంటిమిట్ట మండల పరిధిలోని మలకాటపల్లి క్రాస్ రోడ్డులో వద్ద ఉన్న మదరసాలో జామియా నూరుల్లా ఇస్లామిక్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సంస్థ చైర్మన్ ఖారీ అబ్దుల్ సుబహాన్ మసీదుల్లో పనిచేసే ఇమాములు,మౌజన్లు, నిరుపేదలకు కులమతాలకు అతీతంగా పింఛన్లను పంపిణీ చేశారు. తన శ్వాస ఉన్నంతవరకు సంస్థ తరఫున పేదలకు సాయం అందిస్తూనే ఉంటామని అబ్దుల్ సుబాహాన్ తెలిపారు. ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండేందుకే ఆయుర్వేద వైద్యశాలను కూడా ఏర్పాటు చేశామని తెలిపారు.


