Friday, 13 February 2026
  • Home  
  • *శ్రోత హృదయ రాణి – ఆకాశవాణి* – డాక్టర్ బద్రి పీర్ కుమార్
- సాహితీ

*శ్రోత హృదయ రాణి – ఆకాశవాణి* – డాక్టర్ బద్రి పీర్ కుమార్

1946 ఫిబ్రవరి 13న ఐక్యరాజ్యసమితి రేడియో స్థాపించబదిండి. సమాచార వ్యాప్తిలో రేడియో ప్రాముఖ్యతను గుర్తించడానికి మరియు ప్రసారకర్తల మధ్య అంతర్జాతీయ సహకారాన్ని పెంపొందించడానికి యునెస్కో (UNESCO) ప్రపంచ రేడియో దినోత్సవాన్ని 2011లో ప్రకటించగా, 2012లో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ ఆమోదించింది. అప్పటినుండి మనం ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 13న ప్రపంచ రేడియో దినోత్సవం జరుపుకుంటున్నాము. విపత్తుల సమయంలో అత్యవసర సమాచారాన్ని అందించడంలోనూ, మారుమూల ప్రాంతాలకు వార్తలను చేరవేయడంలోనూ రేడియో కీలక పాత్ర వహిస్తుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా అతి తక్కువ ఖర్చుతో కూడిందే కాకుండా అత్యధిక మందిని చేరుకోగల మాధ్యమంగ చెప్పవచ్చు. భారత్‌లో ఆకాశవాణి 98 శాతం జనాభాకు చేరువలో ఉండి, సమాచార విప్లవంలో ప్రధాన పాత్ర పోషిస్తోంది. ప్రస్తుతం ప్రధానమంత్రి మోదీ నిర్వహించే “మన్‌ కీ బాత్‌” కార్యక్రమం ద్వారా రేడియో మాధ్యమానికి కొత్త జవజీవాలు అందుతున్నాయని చెప్పవచ్చు. ఈ సందర్భంగా ‘శ్రోత హృదయ రాణి ఆకాశవాణి’ కవిత పాఠకుల కోసం బాలమిత్ర కథల నుండి ప్రపంచ చరిత్ర దాక గ్రామీణం నుండి పట్టణం దాక వ్యవసాయం నుండి అంతర్జాతీయం దాక సాంప్రదాయం నుండి ఆధునికీయం దాక వార్తా విశేషాలను అందించే సామాజిక వారధి మానసోల్లాస ప్రజాజీవన శ్రవణసన్నిధి సమాజాన్ని చైతన్య పరచే ఆకాశనిధి పాటైనా కథైనా వార్తయినా జనరంజక పెన్నిధి. మన ఇంటి మీడియాగ యోగ్యమైన రేడియోగ రైతు రాగాల రసమయిగ శ్రోత హృదయ రాణిగ కాలక్షేప కళారూపిణిగ ప్రతి ఇంటికి చేరే మధురిమల వాణిగ ప్రకటనల సారధిగ గుర్తింపు వాహినిగ వాతావరణ సూచనల సాంకేతిక నేస్తంగ వాక్చాతుర్య కళాకారుల కమనీయ ఆశ్రయం శ్రోత హృదయ సామ్రాజ్య చైతన్య నిలయం. బహు భాషల వర్షించు వినోదజలం వెదజల్లు హరివిల్లుల ఆనందగళం విజ్ఞానమందించు సుగుణాల ఫలం ఆ ఫలసారంలో ఆంద్రీయం భారతీయం ప్రపంచీయం అన్నింటిలో ప్రధాన ఆశయం జాతీయం భూగోళ గమన వేగం మానవాళి వికాసరాగం భావజాల సంయోగం తో భిన్నత్వంలో ఏకత్వ పరిమళ పరికరమే రేడియో.. ప్రపంచ సమాచార స్రవంతిలో ఆకాశవాణి శ్రోత హృదయ రాణి

1946 ఫిబ్రవరి 13న ఐక్యరాజ్యసమితి రేడియో స్థాపించబదిండి. సమాచార వ్యాప్తిలో రేడియో ప్రాముఖ్యతను గుర్తించడానికి మరియు ప్రసారకర్తల మధ్య అంతర్జాతీయ సహకారాన్ని పెంపొందించడానికి యునెస్కో (UNESCO) ప్రపంచ రేడియో దినోత్సవాన్ని 2011లో ప్రకటించగా, 2012లో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ ఆమోదించింది. అప్పటినుండి మనం ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 13న ప్రపంచ రేడియో దినోత్సవం జరుపుకుంటున్నాము. విపత్తుల సమయంలో అత్యవసర సమాచారాన్ని అందించడంలోనూ, మారుమూల ప్రాంతాలకు వార్తలను చేరవేయడంలోనూ రేడియో కీలక పాత్ర వహిస్తుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా అతి తక్కువ ఖర్చుతో కూడిందే కాకుండా అత్యధిక మందిని చేరుకోగల మాధ్యమంగ చెప్పవచ్చు. భారత్‌లో ఆకాశవాణి 98 శాతం జనాభాకు చేరువలో ఉండి, సమాచార విప్లవంలో ప్రధాన పాత్ర పోషిస్తోంది. ప్రస్తుతం ప్రధానమంత్రి మోదీ నిర్వహించే “మన్‌ కీ బాత్‌” కార్యక్రమం ద్వారా రేడియో మాధ్యమానికి కొత్త జవజీవాలు అందుతున్నాయని చెప్పవచ్చు. ఈ సందర్భంగా ‘శ్రోత హృదయ రాణి ఆకాశవాణి’ కవిత పాఠకుల కోసం

బాలమిత్ర కథల నుండి ప్రపంచ చరిత్ర దాక
గ్రామీణం నుండి పట్టణం దాక
వ్యవసాయం నుండి అంతర్జాతీయం దాక
సాంప్రదాయం నుండి ఆధునికీయం దాక

వార్తా విశేషాలను అందించే సామాజిక వారధి
మానసోల్లాస ప్రజాజీవన శ్రవణసన్నిధి
సమాజాన్ని చైతన్య పరచే ఆకాశనిధి
పాటైనా కథైనా వార్తయినా జనరంజక పెన్నిధి.

మన ఇంటి మీడియాగ
యోగ్యమైన రేడియోగ
రైతు రాగాల రసమయిగ
శ్రోత హృదయ రాణిగ
కాలక్షేప కళారూపిణిగ
ప్రతి ఇంటికి చేరే మధురిమల వాణిగ

ప్రకటనల సారధిగ
గుర్తింపు వాహినిగ
వాతావరణ సూచనల సాంకేతిక నేస్తంగ
వాక్చాతుర్య కళాకారుల కమనీయ ఆశ్రయం
శ్రోత హృదయ సామ్రాజ్య చైతన్య నిలయం.

బహు భాషల వర్షించు వినోదజలం
వెదజల్లు హరివిల్లుల ఆనందగళం
విజ్ఞానమందించు సుగుణాల ఫలం

ఆ ఫలసారంలో ఆంద్రీయం భారతీయం ప్రపంచీయం
అన్నింటిలో ప్రధాన ఆశయం
జాతీయం

భూగోళ గమన వేగం
మానవాళి వికాసరాగం
భావజాల సంయోగం తో
భిన్నత్వంలో ఏకత్వ పరిమళ పరికరమే రేడియో..
ప్రపంచ సమాచార స్రవంతిలో
ఆకాశవాణి శ్రోత హృదయ రాణి

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.