Thursday, 12 February 2026
  • Home  
  • శ్రీ సౌమ్యనాథ స్వామిని వైకుంఠ ద్వారం ద్వారా దర్శించుకున్న అతికారి కృష్ణ ​గౌరవప్రదంగా స్వాగతం పలికిన యెద్దల విజయ సాగర్ ​టీడీపీ నాయకులను పరిచయం చేసిన మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్
- అన్నమయ్య

శ్రీ సౌమ్యనాథ స్వామిని వైకుంఠ ద్వారం ద్వారా దర్శించుకున్న అతికారి కృష్ణ ​గౌరవప్రదంగా స్వాగతం పలికిన యెద్దల విజయ సాగర్ ​టీడీపీ నాయకులను పరిచయం చేసిన మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్

​వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని నందలూరులోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ సౌమ్యనాథ స్వామి వారిని రాజంపేట పార్లమెంట్ సమన్వయకర్త అతికారి కృష్ణ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా రాజంపేట అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ యెద్దల విజయ సాగర్ ఆయనకు మర్యాదపూర్వక స్వాగతం పలికి, ఆప్యాయంగా పలకరించారు. వీరు కలిసి స్వామివారిని వైకుంఠ ద్వారం ద్వారా దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ​ఆలయ విశిష్టతను వివరించిన విజయ సాగర్: దర్శనానంతరం యెద్దల విజయ సాగర్ ఆలయ పురాణ ప్రాశస్త్యాన్ని, చారిత్రక విశిష్టతను అతికారి కృష్ణకు క్షుణ్ణంగా వివరించారు. అనంతరం నందలూరు మండలంలోని తెలుగుదేశం పార్టీకు చెందిన నాయకులను, కార్యకర్తలను అతికారి కృష్ణకు పేరుపేరునా పరిచయం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అతికారి కృష్ణ మాట్లాడుతూ: అత్యంత మహిమాన్వితమైన ఈ క్షేత్రాన్ని దర్శించుకోవడం సంతోషంగా ఉందని, రాష్ట్ర ప్రజలందరికీ స్వామివారి ఆశీస్సులు ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. ​ఈ సందర్భంగా యెద్దల విజయ సాగర్ మాట్లాడుతూ: “వైకుంఠ ఏకాదశి వంటి పవిత్ర పర్వదినాన మన రాజంపేట పార్లమెంట్ సమన్వయకర్త అతికారి కృష్ణ సౌమ్యనాథుని దర్శించుకోవడం చాలా సంతోషకరం అని. నందలూరు క్షేత్రం అత్యంత మహిమాన్వితమైనది అని. స్వామివారి ఆశీస్సులతో ఈ ప్రాంతం అభివృద్ధి పథంలో పయనించాలని, కూటమి ప్రభుత్వం ప్రజలందరికీ అండగా నిలవాలని కోరుకుంటున్నాము అని. నియోజకవర్గంలో కూటమి నాయకులు, కార్యకర్తలు అందరూ సమన్వయంతో ఉత్సాహంగా పనిచేస్తున్నారని” ఆయన తెలియజేశారు. ​ఈ కార్యక్రమంలో మండల జనసేన మరియు టిడిపి ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

​వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని నందలూరులోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ సౌమ్యనాథ స్వామి వారిని రాజంపేట పార్లమెంట్ సమన్వయకర్త అతికారి కృష్ణ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా రాజంపేట అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ యెద్దల విజయ సాగర్ ఆయనకు మర్యాదపూర్వక స్వాగతం పలికి, ఆప్యాయంగా పలకరించారు. వీరు కలిసి స్వామివారిని వైకుంఠ ద్వారం ద్వారా దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

​ఆలయ విశిష్టతను వివరించిన విజయ సాగర్:

దర్శనానంతరం యెద్దల విజయ సాగర్ ఆలయ పురాణ ప్రాశస్త్యాన్ని, చారిత్రక విశిష్టతను అతికారి కృష్ణకు క్షుణ్ణంగా వివరించారు. అనంతరం నందలూరు మండలంలోని తెలుగుదేశం పార్టీకు చెందిన నాయకులను, కార్యకర్తలను అతికారి కృష్ణకు పేరుపేరునా పరిచయం చేశారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న అతికారి కృష్ణ మాట్లాడుతూ:

అత్యంత మహిమాన్వితమైన ఈ క్షేత్రాన్ని దర్శించుకోవడం సంతోషంగా ఉందని, రాష్ట్ర ప్రజలందరికీ స్వామివారి ఆశీస్సులు ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు.

​ఈ సందర్భంగా యెద్దల విజయ సాగర్ మాట్లాడుతూ:

“వైకుంఠ ఏకాదశి వంటి పవిత్ర పర్వదినాన మన రాజంపేట పార్లమెంట్ సమన్వయకర్త అతికారి కృష్ణ సౌమ్యనాథుని దర్శించుకోవడం చాలా సంతోషకరం అని. నందలూరు క్షేత్రం అత్యంత మహిమాన్వితమైనది అని. స్వామివారి ఆశీస్సులతో ఈ ప్రాంతం అభివృద్ధి పథంలో పయనించాలని, కూటమి ప్రభుత్వం ప్రజలందరికీ అండగా నిలవాలని కోరుకుంటున్నాము అని. నియోజకవర్గంలో కూటమి నాయకులు, కార్యకర్తలు అందరూ సమన్వయంతో ఉత్సాహంగా పనిచేస్తున్నారని” ఆయన తెలియజేశారు.

​ఈ కార్యక్రమంలో మండల జనసేన మరియు టిడిపి ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.