శ్రీకాళహస్తి నవంబర్ 17, పున్నమి న్యూస్ : తిరుపతి జిల్లాలోని శ్రీకాళహస్తి నియోజిక వర్గంలో రాయల చెరువుకు గండి పడటంతో దాదాపుగా 20 అడుగుల మేర చెరువు కట్ట తెగి దగ్గరలో ఉన్నటువంటి కెవిబిపురం మండలం కళత్తూరు గ్రామం, పాతపాలెం అనే గ్రామాలు నీట మునిగిపోయాయి ఈ కారణంగా కళత్తూరు గ్రామ ప్రజలు ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు, పశువులను కోల్పోవడం జరిగింది. అదేవిధంగా తినడానికి తిండి కట్టుకోవడానికి బట్ట లేక వారం రోజులపాటు ఇబ్బందులను ఎదోర్కొంటున్నారు. శ్రీకాళహస్తి పట్టణంలోని శ్రీ సరస్వతీ శిశు మందిర్, సేవా భారతి (ఆర్ఎస్ఎస్) ఆధ్వర్యంలో కళత్తూరు గ్రామంలోని 450 కుటుంబాలకు, పాతపాలెం నందలి 60 కుటుంబాలకు చీరలు, దుప్పట్లను పంచిపెట్టడం జరిగింది. ఈ సందర్భంగా సమాజ సేవకులు మాట్లాడుతూ….ఎక్కడైనా ఎప్పుడైనా ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ఎటువంటి లాభాపేక్ష లేకుండా తక్షణమే ముందుండి సేవ చేయడంలో ఆర్ఎస్ఎస్, శ్రీ సరస్వతి శిశు మందిరాలు ముందు ఉంటాయని అందులో భాగంగానే కళత్తూరు నందు సంభవించిన ప్రకృతి వైపరీత్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ గ్రామ ప్రజలకు సహాయ సహకారాలను అందించడం జరిగిందని మానవసేవయే మాధవసేవ అనే భావంతో ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అంజూరు బాలసుబ్రమణ్యం, శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాల అధ్యక్షులు చాగణం భక్తవత్సలయ, మంగిరెడ్డి, సుబ్రహ్మణ్యం రెడ్డి, నాగరాజులు, ఉమా శంకర్, అమరావతి, పద్మశ్రీ, కిషోర్, తరుణ్, చందు, ప్రసాద్, సుధాకర్ పాఠశాల మాతాజీలు పాల్గొన్నరు.

శ్రీ సరస్వతీ శిశు మందిర్ పాఠశాల ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం