శ్రీకాకుళం జిల్లా, జూలై 20:శ్రీ సత్య సాయి బాబా శతజయంతి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు ఆదివారం బ్రహ్మీ ముహూర్తంలో నరసన్నపేట జోన్ పరిధిలోని పిన్నింటిపేట శ్రీ సత్య సాయి సేవా సమితి ఆధ్వర్యంలో SV కొత్తూరు గ్రామంలో స్వామి వారి పల్లకీ సేవ వైభవంగా నిర్వహించబడింది.ఈ సందర్భంగా గ్రామంలో భక్తులు ఇంటింటా రంగవల్లులతో స్వాగతం పలికారు. పిన్నింటిపేట సాయి భక్తజన బృందం ఎంతో భక్తి శ్రద్ధలతో స్వామి వారి పల్లకీ సేవను నిర్వహించింది. కార్యక్రమంలో భాగంగా ఇరువురి నారాయణ దంపతులకు “అమృత కలశాలు” అందజేయడం జరిగింది.ఈ సేవా కార్యక్రమాన్ని స్థానిక భక్తులు అధిక సంఖ్యలో హర్షోత్సాహాలతో పాల్గొని విజయవంతం చేశారు. పాల్గొన్న ప్రతి భక్తుడిపై స్వామి వారి దివ్య ఆశీస్సులు ఉండాలని సమితి కన్వీనర్ శ్రీ పొట్నూరు రత్నాకర్ రావు ఆకాంక్షించారు.ఓం శ్రీ సాయిరాం 🙏



