ఈ వార్తకు ఫోటో కలదు
రైటప్ : శ్రీ శోభనాచల వ్యాఘ్ర లక్ష్మీ నరసింహస్వామి వారు.
శ్రీ శోభనాచల వ్యాఘ్ర లక్ష్మీ నరసింహస్వామి వార్ల ఆలయ పవిత్రోత్సవాలు ప్రారంభం
ఆగిరిపల్లి, ఆగస్టు 4
స్థానిక శ్రీ శోభనాచల వ్యాఘ్ర లక్ష్మీ నరసింహస్వామి వార్ల ఆలయ పవిత్రోత్సవాలు ఆలయ కార్య నిర్వాహణాధికారి సిహెచ్ సాయి పర్యవేక్షణలో సోమవారం ఘనంగా ప్రారంభయ్యాయి. శ్రీ విశ్వ వాసు నామ సంవత్సర శ్రావణ శుద్ధ దశమి (నాలుగో తేదీ నుండి ఏడవ తేదీ వరకు) నుండి త్రయోదశి వరకు శోభనాద్రిపై స్వయం వ్యక్తంగా వేంచేసి యున్న శ్రీ శోభనాచల వ్యాఘ్ర లక్ష్మీ నరసింహస్వామి వార్ల ఆలయ సన్నిధిలో శ్రీ వైఖాన సాగమ శాస్త్రానుసారంగా పవిత్రోత్సవాలు ప్రారంభమయ్యాయి. ప్రతినిత్యం ఉదయం 6 గంటలకు సుప్రభాత సేవ. ఉదయం తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఆలయ నిత్య కార్యక్రమము లు, సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు పవిత్రోత్సవ విశేష కార్యక్రమములు. నీరాజన మంత్ర పుష్ప తీర్థ ప్రసాద వినియోగం నిర్వహిస్తున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు వేదాంతం శేషుబాబు తెలిపారు. సోమవారం ఉదయం శ్రీ శోభనాచల వ్యాఘ్ర లక్ష్మీ నరసింహస్వామి వార్లకు పరివార దేవతలకు స్నపన, విశేషాలంకరణ, నిరాజన మంత్రపుష్ప, తీర్థ ప్రసాద వినియోగము. సాయంత్రం విశ్వక్సేన పూజ, పుణ్యాహ వచన, అజస్త్ర దీపారాధన, ఆచార్య అర్చక రుత్విక్ యజమాన దీక్షాధారణ, మృత్సం గ్రహణము, అంకురారోపణ, నిరాజనం మంత్ర పుష్ప తీర్థప్రసాద్వినియోగం నిర్వహించారు. ఈ కార్యక్రమాలను తిలకించి స్వామివార్లను దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి విచ్చేశారు.


