Wednesday, 11 February 2026
  • Home  
  • శ్రీ వెంగమాంబ పేరంటాలు తల్లి సేవలో మంత్రి ఆనం ఎమ్మెల్యే కాకర్ల..!
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

శ్రీ వెంగమాంబ పేరంటాలు తల్లి సేవలో మంత్రి ఆనం ఎమ్మెల్యే కాకర్ల..!

ఉదయగిరి నియోజకవర్గం లోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన నర్రవాడ శ్రీ వెంగమాంబ పేరంటాలు తల్లి సేవలో దేవాదాయ శాఖ మంత్రి శ్రీ ఆనం రామనారాయణరెడ్డి ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ తరించారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రులు అయ్యారు. ఈ సందర్భంగా ఆలయ పరిసర ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించారు. కొండ వద్ద శ్రీ వెంగమాంబ తల్లి భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే అక్కడ పర్యాటకులను ఆకట్టుకునే విధంగా చేయవలసిన అభివృద్ధి కార్యక్రమాలను మ్యాప్ ద్వారా పరిశీలించారు. అభివృద్ధికి అవసరమైన నిధులను తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి ట్రస్టు ద్వారా సమకూర్చేందుకు కృషి చేస్తానని మంత్రి ఆనం తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, వింజమూరు మండలం గుండె మడగల గ్రామంలో కోటి రూపాయలతో శ్రీ సీతారామాంజనేయ ఆలయ నిర్మాణానికి మంత్రితో కలిసి భూమి పూజ నిర్వహించినట్లు తెలిపారు. ఉదయగిరి నియోజకవర్గాన్ని పర్యాటక కేంద్రంగా చేసేందుకు కృషి చేస్తున్నామని అందులో భాగంగా మొదటి అడుగు శ్రీ వెంగమాంబ తల్లి ఆలయం నుండి ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. నర్రవాడ శ్రీ వెంగమాంబ ఆలయం ఉదయగిరి లోని ఉదయగిరి కోట శ్రీ రంగనాయకుల దేవాలయం, ఘటిక సిద్దేశ్వరం దేవాలయాలను కలుపుతూ టూరిజం డెవలప్మెంట్ చేసేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. మంత్రి ఆనం సహకారం మరువలేనిది అని, దేవాదాయ శాఖ మంత్రి మన నెల్లూరు వాసి కావడం అదృష్టమన్నారు. బ్రహ్మోత్సవాలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందస్తుగానే ప్రణాళికలు రచించి, ఆ విధంగా ముందుకు వెళ్లి, భక్తులకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో, మాజీ ఎమ్మెల్యే కంభం విజయరామిరెడ్డి, మల్లంపాటి గురవయ్య నాయుడు, గిరి నాయుడు, ఆలయ ఈవో శ్రీనివాసులు రెడ్డి, ఆలయ ధర్మకర్తల మండలి, ఉండేలా గురువారెడ్డి, ఆంజనేయులు రెడ్డి,ఇతర నాయకులు తదితరులు ఉన్నారు.

ఉదయగిరి నియోజకవర్గం లోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన నర్రవాడ శ్రీ వెంగమాంబ పేరంటాలు తల్లి సేవలో దేవాదాయ శాఖ మంత్రి శ్రీ ఆనం రామనారాయణరెడ్డి ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ తరించారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రులు అయ్యారు. ఈ సందర్భంగా ఆలయ పరిసర ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించారు. కొండ వద్ద శ్రీ వెంగమాంబ తల్లి భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే అక్కడ పర్యాటకులను ఆకట్టుకునే విధంగా చేయవలసిన అభివృద్ధి కార్యక్రమాలను మ్యాప్ ద్వారా పరిశీలించారు. అభివృద్ధికి అవసరమైన నిధులను తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి ట్రస్టు ద్వారా సమకూర్చేందుకు కృషి చేస్తానని మంత్రి ఆనం తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, వింజమూరు మండలం గుండె మడగల గ్రామంలో కోటి రూపాయలతో శ్రీ సీతారామాంజనేయ ఆలయ నిర్మాణానికి మంత్రితో కలిసి భూమి పూజ నిర్వహించినట్లు తెలిపారు. ఉదయగిరి నియోజకవర్గాన్ని పర్యాటక కేంద్రంగా చేసేందుకు కృషి చేస్తున్నామని అందులో భాగంగా మొదటి అడుగు శ్రీ వెంగమాంబ తల్లి ఆలయం నుండి ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. నర్రవాడ శ్రీ వెంగమాంబ ఆలయం ఉదయగిరి లోని ఉదయగిరి కోట శ్రీ రంగనాయకుల దేవాలయం, ఘటిక సిద్దేశ్వరం దేవాలయాలను కలుపుతూ టూరిజం డెవలప్మెంట్ చేసేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. మంత్రి ఆనం సహకారం మరువలేనిది అని, దేవాదాయ శాఖ మంత్రి మన నెల్లూరు వాసి కావడం అదృష్టమన్నారు. బ్రహ్మోత్సవాలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందస్తుగానే ప్రణాళికలు రచించి, ఆ విధంగా ముందుకు వెళ్లి, భక్తులకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో, మాజీ ఎమ్మెల్యే కంభం విజయరామిరెడ్డి, మల్లంపాటి గురవయ్య నాయుడు, గిరి నాయుడు, ఆలయ ఈవో శ్రీనివాసులు రెడ్డి, ఆలయ ధర్మకర్తల మండలి, ఉండేలా గురువారెడ్డి, ఆంజనేయులు రెడ్డి,ఇతర నాయకులు తదితరులు ఉన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.