విశాఖపట్నం: నవంబర్ 21, 2025
పోలిపాడ్యమి సందర్భంగా శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామి వారి దేవస్థానం కొండ దిగువన గల పవిత్ర వరాహ పుష్కరిణిలో.
పవిత్రమైన పోలిపాడ్యమి పర్వదినాన్ని పురస్కరించుకుని, వరాహ పుష్కరిణిలో భక్తులు మరియు స్థానిక గ్రామస్తులచే దీపాల వెలిగింపు కార్యక్రమం అంబరాన్నంటింది.
తెల్లవారుజాము నుండే భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో అధిక సంఖ్యలో పుష్కరిణి వద్దకు చేరుకున్నారు. ముఖ్యంగా మహిళలు, ఉత్సాహంగా తమ వెంట తెచ్చుకున్న దీపాలను, మొక్కుబడులను చెల్లించుకుంటూ, పవిత్ర పుష్కరిణి నదిలో వదిలారు.
భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని, దేవస్థానం పటిష్టమైన ఏర్పాట్లు చేసింది.
పుష్కరిణి చెరువు వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ఉండేందుకు బారికేడింగ్ ఏర్పాటు చేయబడింది. ప్రత్యేకంగా ఈతగాళ్ళ కమ్యూనిటీ గార్డులు, పోలీస్ సిబ్బంది బందోబస్తు నిర్వహించారు.
వరాహ పుష్కరిణి మార్గంలో ట్రాఫిక్ పోలీసులు ద్విచక్ర వాహనాల రాకపోకలను నియంత్రిస్తూ, భక్తులకు ఇబ్బంది కలగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.


