శ్రీ రధాలమ్మాతల్లి పండుగలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే వెంకటరామయ్య.
గాజువాక 87వ వార్డు కణితిలోని గ్రామ దేవత శ్రీ రధాలమ్మాతల్లి వార్షిక పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు చింతలపూడి వెంకటరామయ్య పాల్గొని పసుపు కుంకుమలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేకువ జామున ప్రారంభమైన ఈ ఉత్సవంలో భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో వైస్సార్సీపీ నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

