ఓబులవారిపల్లి సెప్టెంబర్ (పున్నమి ప్రతినిధి)
అన్నమయ్య జిల్లా, ఓబులవారిపల్లె మండలం, శేషక్కగారిపల్లె గ్రామంలో శ్రీ మహాలక్ష్మీ దేవాలయ 5వ వార్షికోత్సవం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో ప్రభుత్వ విప్, రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.గ్రామస్థుల ఆహ్వానం మేరకు విచ్చేసిన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన గ్రామ ప్రజలతో కలసి ఉత్సవాల్లో పాలుపంచుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నేతలు, స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు.


