పున్నమి న్యూస్, పెద్దాపురం, నవంబర్ 17.కార్తీక మాసంలోని సోమవారం పురస్కరించుకొని ప్రముఖ గ్రామ దేవతాలయం శ్రీ మరిడమ్మ అమ్మవారి దేవస్థానంలో అఖండ మహా దీపారాధన కార్యక్రమం ఘనంగా జరిగింది.
ఆలయ ఈవో శ్రీమతి విజయలక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంనకు ఎమ్మెల్యే చినరాజప్ప గారు, రాజా సూరిబాబు రాజు గారు ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. ఎమ్మెల్యే గారు అమ్మవారిని ప్రత్యేక పూజలు చేసి దర్శనం చేసుకుని, స్వయంగా అఖండ దీపారాధనను తిలకించారు.
కార్తీక మాసంలో సోమవారాలు పవిత్రమైనవిగా భావించే నేపథ్యంలో వేకువజాము నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారికి పూజలు, అభిషేకాలు, అఖండ దీపారాధనలో పాల్గొన్నారని ఆలయ EO విజయలక్ష్మి అన్నారు.
ఆలయ అధికారులు, సిబ్బంది సహకారంతో కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగిందని భక్తులు హర్షం వ్యక్తం చేశారు.

శ్రీ మరిడమ్మ అమ్మవారి ఆలయంలో కార్తీక సోమవారం సందర్భంగా అఖండ మహా దీపారాధన
పున్నమి న్యూస్, పెద్దాపురం, నవంబర్ 17.కార్తీక మాసంలోని సోమవారం పురస్కరించుకొని ప్రముఖ గ్రామ దేవతాలయం శ్రీ మరిడమ్మ అమ్మవారి దేవస్థానంలో అఖండ మహా దీపారాధన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఆలయ ఈవో శ్రీమతి విజయలక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంనకు ఎమ్మెల్యే చినరాజప్ప గారు, రాజా సూరిబాబు రాజు గారు ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. ఎమ్మెల్యే గారు అమ్మవారిని ప్రత్యేక పూజలు చేసి దర్శనం చేసుకుని, స్వయంగా అఖండ దీపారాధనను తిలకించారు. కార్తీక మాసంలో సోమవారాలు పవిత్రమైనవిగా భావించే నేపథ్యంలో వేకువజాము నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారికి పూజలు, అభిషేకాలు, అఖండ దీపారాధనలో పాల్గొన్నారని ఆలయ EO విజయలక్ష్మి అన్నారు. ఆలయ అధికారులు, సిబ్బంది సహకారంతో కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగిందని భక్తులు హర్షం వ్యక్తం చేశారు.

