నంద్యాల శ్రీ భగీరథ సగర (ఉప్పర) సంక్షేమ సంఘం, నంద్యాల జిల్లా ఆధ్వర్యంలో కార్తీక వనభోజన కార్యక్రమాన్ని స్థానిక జమ్ముల పరమేశ్వరి దేవస్థానం నందు సోదర భావంతో, భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించడం జరిగిందని. ఈ కార్యక్రమానికి నంద్యాల జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి ఎన్.ఎం.డి. ఫిరోజ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎన్ఎండి ఫిరోజ్ మాట్లాడుతూ… “శ్రీ భగీరథ సగర (ఉప్పర) సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కార్తీక మాస పవిత్రతను తెలియజేస్తూ, సోదర భావాన్ని పెంచే విధంగా ఇంత గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించిన సంఘం నాయకులకు, సభ్యులకు నా హృదయపూర్వక అభినందనల తెలియజేశారు . మీరంతా ఇలా ఒకే వేదికపై కలిసి, భక్తిశ్రద్ధలతో వనభోజనాలు చేసుకోవడం నిజంగా ఆనందదాయకమని. ఉప్పర సామాజిక వర్గం అంటే కష్టాన్ని నమ్ముకుని, తమ నిబద్ధతతో సమాజ అభివృద్ధికి పాటుపడే వర్గం అన్నారు . ఈ సందర్భంగా మీరంతా సంఘటితంగా ఉండాలని, మీ ఐక్యతను చాటిచెప్పాలని కోరుకుంటున్నాను అని . ఐక్యతలోనే నిజమైన బలం, అభివృద్ధి దాగి ఉండన్నారు. నంద్యాల జిల్లా టీడీపీ పార్టీ ప్రధాన కార్యదర్శిగా, నంద్యాల బిడ్డగా మీకు నేను హామీ ఇస్తున్నాను అని . మీ సంక్షేమం, అభివృద్ధికి సంబంధించిన ఏ సమస్య అయినా నా దృష్టికి తీసుకురండి. మీ పిల్లల విద్య, నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు, అలాగే మీ సామాజిక వర్గానికి రావాల్సిన ప్రభుత్వ పథకాలు, హక్కుల విషయంలో నేను ఎల్లప్పుడూ మీకు అండగా ఉంటానని . సామాజిక వర్గ అభివృద్ధికి పాటుపడే ప్రతి నాయకుడికి, కార్యకర్తకు నా సంపూర్ణ సహకారం ఉంటుందని . ఈ పవిత్ర కార్తీక మాసంలో శ్రీ భగీరథ స్వామి ఆశీస్సులు మీ అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ వనభోజన కార్యక్రమాన్ని నన్ను ఆహ్వానించిన మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అన్నారు
ఈ కార్యక్రమంలో నంద్యాల జిల్లా ఉప్పర సంఘం అధ్యక్షుడు ఉప్పరి సురేష్ కుమార్, బనగానపల్లె మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ కొండు నడిపి బూసన్న, ఉడుములపాడు గ్రామ సర్పంచ్ ఉప్పరి రాధా ,నంద్యాల అసెంబ్లీ అధ్యక్షుడు బోయిని బాలాజీ, ప్రధాన కార్యదర్శి చిలకల బాలరాజు, ట్రెజరర్ గోరుకలు శివప్రసాద్ ,నంద్యాల అసెంబ్లీ గౌరవధ్యక్షుడు చిలకల చిన్నయ్య, తన్నీరు శివయ్య, డాక్టర్ గురు ప్రసాద్ ,టీచర్ సుబ్బరాయుడు, పెద్ద ఎత్తున సంఘీయులు తదితరులు పాల్గొన్నారు


