Thursday, 5 February 2026
  • Home  
  • శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాల.. విజయవంతంగా నిర్వహింపబడిన ఫిజిక్స్ ఫెస్ట్ 2025……
- ఎన్ టి ఆర్ జిల్లా

శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాల.. విజయవంతంగా నిర్వహింపబడిన ఫిజిక్స్ ఫెస్ట్ 2025……

శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాల, విజయవాడ భౌతిక శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంధన సంరక్షణ సంస్థ (APSECM) సహకారంతో Physics Fest – 2025 కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా APCPDCL మేనేజింగ్ డైరెక్టర్ గారు, NTR జిల్లా IAS అధికారులు, APGENCO, APSECM, NREDCAP, APTRANSCO సంస్థల మేనేజింగ్ డైరెక్టర్లు మరియు ఇంధన సంరక్షణ రంగానికి చెందిన ప్రముఖ అధికారులు పాల్గొని విద్యార్థులకు విలువైన సూచనలు, ప్రోత్సాహకరమైన సందేశాలు అందించారు. ఈ Physics Fest సందర్భంగా Energy Conservation Week ను పురస్కరించుకొని విద్యార్థులలో ఇంధన పొదుపు, పర్యావరణ సంరక్షణపై అవగాహన కల్పించేలా వివిధ కార్యక్రమాలు నిర్వహించబడినవి. ఈ వేడుకలో భాగంగా Essay Writing, Quiz, Dumb Charades, Poster Presentation, PowerPoint Presentation, Spot Photography వంటి పోటీలు నిర్వహించబడినవి. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడంలో APSECM డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ శ్రీ వి. పద్మజ గారు ముఖ్య పాత్ర పోషించారు. అలాగే భౌతిక శాస్త్ర విభాగాధిపతి డా. ఎం. గీతా మాధురి గారు, బోధన సిబ్బంది శ్రీమతి ఎస్.ఎన్. సునీత గారు, శ్రీమతి డి. నీరజ గారు, బోధనేతర సిబ్బంది అందరూ ఈ కార్యక్రమానికి సంపూర్ణ సహకారం అందించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ గారు అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.

శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాల, విజయవాడ
భౌతిక శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంధన సంరక్షణ సంస్థ (APSECM) సహకారంతో
Physics Fest – 2025 కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడింది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా
APCPDCL మేనేజింగ్ డైరెక్టర్ గారు,
NTR జిల్లా IAS అధికారులు,
APGENCO, APSECM, NREDCAP, APTRANSCO సంస్థల మేనేజింగ్ డైరెక్టర్లు మరియు
ఇంధన సంరక్షణ రంగానికి చెందిన ప్రముఖ అధికారులు పాల్గొని
విద్యార్థులకు విలువైన సూచనలు, ప్రోత్సాహకరమైన సందేశాలు అందించారు.

ఈ Physics Fest సందర్భంగా
Energy Conservation Week ను పురస్కరించుకొని
విద్యార్థులలో ఇంధన పొదుపు, పర్యావరణ సంరక్షణపై అవగాహన కల్పించేలా
వివిధ కార్యక్రమాలు నిర్వహించబడినవి.

ఈ వేడుకలో భాగంగా
Essay Writing, Quiz, Dumb Charades,
Poster Presentation,
PowerPoint Presentation,
Spot Photography వంటి పోటీలు నిర్వహించబడినవి.

ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడంలో
APSECM డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్
శ్రీ వి. పద్మజ గారు ముఖ్య పాత్ర పోషించారు.

అలాగే భౌతిక శాస్త్ర విభాగాధిపతి
డా. ఎం. గీతా మాధురి గారు,
బోధన సిబ్బంది
శ్రీమతి ఎస్.ఎన్. సునీత గారు, శ్రీమతి డి. నీరజ గారు,
బోధనేతర సిబ్బంది అందరూ
ఈ కార్యక్రమానికి సంపూర్ణ సహకారం అందించారు.

ఈ సందర్భంగా
కళాశాల ప్రిన్సిపాల్ గారు అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.