Monday, 8 December 2025
  • Home  
  • శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాల కెమిస్ట్రీ విభాగo వారి గెస్ట్ లెక్చర్…
- ఎన్ టి ఆర్ జిల్లా

శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాల కెమిస్ట్రీ విభాగo వారి గెస్ట్ లెక్చర్…

8 .12. 2025వ తేదీ శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాల,రసాయన శాస్త్ర విభాగం వారు RAINBOW WEEK CELEBRATIONS- 2025 లో భాగంగామొదటి రోజున గెస్ట్ లెక్చర్ను కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వేమూరి వెంకట సుబ్రహ్మణ్య కుమార్ గారి ఆధ్వర్యంలో విజయవంతంగా నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ నన్నపనేని మాధవి , (ప్రొఫెసర్,HOD,పిజి కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ )గారు ముఖ్య అతిథిగా పాల్గొని *తాజా పరిణామాలు-పరిశోధన అవకాశాలు *అనే అంశంపై ఉపన్యసించారు. నానో కెమిస్ట్రీ అంశాలను అర్థవంతంగా విద్యార్థులకు వివరించారు. నానో స్థాయిలో పదార్థాలు పొందే ప్రత్యేక లక్షణాలు….. ఉపరితల ప్రాంతం పెరగడం, కొత్త రకాల ఎలక్ట్రిక్ మరియు ఆప్టికల్ లక్షణాల ప్రదర్శన లాంటి అంశాలను ఉదాహరణలతో చూపించారు. నానో పార్టికల్స్, నానో రాడ్స్, నానో ట్యూబ్స్, నానో ఫిలిమ్స్, నానో కంపోజిట్ వంటి రకరకాల నాను మెటీరియల్స్ ను చిత్రాలతో వివరించారు. వీటి తయారీ పద్ధతులు , ఉపయోగాలు మరియు డిమాండ్ గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఉపన్యాసంలో అనంతరం సింథసిస్ పద్ధతుల గురించి లోతుగా చర్చించారు. ముఖ్యంగా టాప్ – డౌన్ మరియు బాటమ్- అప్, పద్ధతులు , తేడాలు, వాటి ప్రయోజనాలు గురించి విద్యార్థులతో చర్చించారు. గ్రాఫిన్ ,గ్రాఫిన్ ఆక్సైడ్, తయారీ గురించి మరియు రసాయన రేడక్షన్ పద్ధతి ద్వారా కాపర్ నానో పార్టికల్స్ తయారీలో ఉపయోగించే సోడియం బోరో హైడ్రేట్ ఆస్కారిక్ ఆమ్లం వంటి ప్రొడ్యూసింగ్ ఏజెంట్ల ప్రాముఖ్యత ను వివరించడమే కాకుండా నానో సైన్స్ ఎందుకు భవిష్యత్తు టెక్నాలజీకి బలమైన పునాది అవుతుందో వివరించి ,పరిశ్రమల్లో ఈ పదార్థాలకు పెరుగుతున్న డిమాండ్ ను, నానో పదార్థాల అనువర్తనను గురించి మాట్లాడుతూ ముఖ్యంగా డ్రగ్ డెలివరీ క్యాన్సర్ చికిత్సలో నానో పార్టికల్స్ ద్వారా ట్యూమర్ కణాలను గుర్తించి చికిత్స చేయడం , బయోసెన్సర్లు, మెడికల్ ఇమేజింగ్, టిష్యూ ఇంజనీరింగ్, ఇలాంటి అనేక రకాల ఉపయోగాలను గురించి విద్యార్థులలో చక్కని అవగాహనను కల్పించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వేమూరి వెంకట సుబ్రమణ్య కుమార్ గారు మాట్లాడుతూ రోజు రోజుకి మారుతున్న కాలానికి అనుగుణంగా పెరుగుతున్న శాస్త్రీయ ఆధునిక రంగాలపై అవగాహన కలగడం చాలా అవసరము అని ఈ లెక్చర్ విద్యార్థుల జీవితాలలో కొత్త ఆలోచనలను రేకెత్తించి , పరిశోధనల పట్ల ఆసక్తిని పెంపొందింప చేస్తుందని విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా డాక్టర్ ఎన్ మాధవి…. (హెడ్ ఆఫ్ ద పిజి కెమిస్ట్రీ డిపార్ట్మెంట్, JKC కాలేజ్ అటానమస్…. గుంటూరు) కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వి వి ఎస్ కుమార్ గారు, రసాయన శాస్త్ర విభాగాధిపతి M. సుభాషిణి అధ్యాపకులు , లావణ్య, శ్యామల,రాధిక మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

8 .12. 2025వ తేదీ శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాల,రసాయన శాస్త్ర విభాగం వారు RAINBOW WEEK CELEBRATIONS- 2025 లో భాగంగామొదటి రోజున గెస్ట్ లెక్చర్ను కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వేమూరి వెంకట సుబ్రహ్మణ్య కుమార్ గారి ఆధ్వర్యంలో విజయవంతంగా నిర్వహించడం జరిగినది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ నన్నపనేని మాధవి , (ప్రొఫెసర్,HOD,పిజి కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ )గారు ముఖ్య అతిథిగా పాల్గొని
*తాజా పరిణామాలు-పరిశోధన అవకాశాలు *అనే అంశంపై ఉపన్యసించారు. నానో కెమిస్ట్రీ అంశాలను అర్థవంతంగా విద్యార్థులకు వివరించారు. నానో స్థాయిలో పదార్థాలు పొందే ప్రత్యేక లక్షణాలు….. ఉపరితల ప్రాంతం పెరగడం, కొత్త రకాల ఎలక్ట్రిక్ మరియు ఆప్టికల్ లక్షణాల ప్రదర్శన లాంటి అంశాలను ఉదాహరణలతో చూపించారు. నానో పార్టికల్స్, నానో రాడ్స్, నానో ట్యూబ్స్, నానో ఫిలిమ్స్, నానో కంపోజిట్ వంటి రకరకాల నాను మెటీరియల్స్ ను చిత్రాలతో వివరించారు. వీటి తయారీ పద్ధతులు , ఉపయోగాలు మరియు డిమాండ్ గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఉపన్యాసంలో అనంతరం సింథసిస్ పద్ధతుల గురించి లోతుగా చర్చించారు. ముఖ్యంగా టాప్ – డౌన్ మరియు బాటమ్- అప్, పద్ధతులు , తేడాలు, వాటి ప్రయోజనాలు గురించి విద్యార్థులతో చర్చించారు. గ్రాఫిన్ ,గ్రాఫిన్ ఆక్సైడ్, తయారీ గురించి మరియు రసాయన రేడక్షన్ పద్ధతి ద్వారా కాపర్ నానో పార్టికల్స్ తయారీలో ఉపయోగించే సోడియం బోరో హైడ్రేట్ ఆస్కారిక్ ఆమ్లం వంటి ప్రొడ్యూసింగ్ ఏజెంట్ల ప్రాముఖ్యత ను వివరించడమే కాకుండా నానో సైన్స్ ఎందుకు భవిష్యత్తు టెక్నాలజీకి బలమైన పునాది అవుతుందో వివరించి ,పరిశ్రమల్లో ఈ పదార్థాలకు పెరుగుతున్న డిమాండ్ ను, నానో పదార్థాల అనువర్తనను గురించి మాట్లాడుతూ ముఖ్యంగా డ్రగ్ డెలివరీ క్యాన్సర్ చికిత్సలో నానో పార్టికల్స్ ద్వారా ట్యూమర్ కణాలను గుర్తించి చికిత్స చేయడం , బయోసెన్సర్లు, మెడికల్ ఇమేజింగ్, టిష్యూ ఇంజనీరింగ్, ఇలాంటి అనేక రకాల ఉపయోగాలను గురించి విద్యార్థులలో చక్కని అవగాహనను కల్పించారు.
ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వేమూరి వెంకట సుబ్రమణ్య కుమార్ గారు మాట్లాడుతూ రోజు రోజుకి మారుతున్న కాలానికి అనుగుణంగా పెరుగుతున్న శాస్త్రీయ ఆధునిక రంగాలపై అవగాహన కలగడం చాలా అవసరము అని ఈ లెక్చర్ విద్యార్థుల జీవితాలలో కొత్త ఆలోచనలను రేకెత్తించి , పరిశోధనల పట్ల ఆసక్తిని పెంపొందింప చేస్తుందని విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా డాక్టర్ ఎన్ మాధవి…. (హెడ్ ఆఫ్ ద పిజి కెమిస్ట్రీ డిపార్ట్మెంట్, JKC కాలేజ్ అటానమస్…. గుంటూరు)
కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వి వి ఎస్ కుమార్ గారు, రసాయన శాస్త్ర విభాగాధిపతి M. సుభాషిణి అధ్యాపకులు , లావణ్య, శ్యామల,రాధిక మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.