చేజర్ల సెప్టెంబరు (పున్నమి ప్రతినిధి)
చేజర్ల మండలం ఆదురుపల్లిలోని శ్రీత్రికోటేశ్వర విద్యాలయంలో ఇస్లాం మత స్థాపకుడైన మహమ్మద్ ప్రవక్త గారి జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి మిలాద్ ఉన్ నబీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థినీ విద్యార్థులు భక్తిశ్రద్ధలతో ప్రార్థనలు నిర్వహించారు. తదుపరి నృత్యాలతో అలరించారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ లక్ష్మీ నరసారెడ్డి, డైరెక్టర్ సుధాకర్ రెడ్డి మరియు ప్రధానోపాధ్యాయులు కృష్ణ చైతన్య మాట్లాడుతూ మహమ్మద్ ప్రవక్త యొక్క జీవిత చరిత్ర, ఖురాన్ బోధనలను విద్యార్థులకు వివరించారు. విద్యార్థుల్లో మతసామరస్యానికి ప్రతీకగా శ్రీ త్రికోటేశ్వర విద్యాలయంలో ప్రతి పండుగను ఘనంగా జరుపుతామని చెప్పారు. కార్యక్రమంలో స్కూలు ఉపాధ్యాయులు, బాల బాలికలు పాల్గొన్నారు.

శ్రీ త్రికోటేశ్వరలో ముందస్తు మిలాద్ – ఉన్ – నబీ వేడుకలు
చేజర్ల సెప్టెంబరు (పున్నమి ప్రతినిధి) చేజర్ల మండలం ఆదురుపల్లిలోని శ్రీత్రికోటేశ్వర విద్యాలయంలో ఇస్లాం మత స్థాపకుడైన మహమ్మద్ ప్రవక్త గారి జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి మిలాద్ ఉన్ నబీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థినీ విద్యార్థులు భక్తిశ్రద్ధలతో ప్రార్థనలు నిర్వహించారు. తదుపరి నృత్యాలతో అలరించారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ లక్ష్మీ నరసారెడ్డి, డైరెక్టర్ సుధాకర్ రెడ్డి మరియు ప్రధానోపాధ్యాయులు కృష్ణ చైతన్య మాట్లాడుతూ మహమ్మద్ ప్రవక్త యొక్క జీవిత చరిత్ర, ఖురాన్ బోధనలను విద్యార్థులకు వివరించారు. విద్యార్థుల్లో మతసామరస్యానికి ప్రతీకగా శ్రీ త్రికోటేశ్వర విద్యాలయంలో ప్రతి పండుగను ఘనంగా జరుపుతామని చెప్పారు. కార్యక్రమంలో స్కూలు ఉపాధ్యాయులు, బాల బాలికలు పాల్గొన్నారు.

