తేదీ: జూలై 7, 2025 | స్థలం: శ్రీ తల్లుగిరి రంగనాథ స్వామి దేవస్థానం
శ్రీ తల్లుగిరి రంగనాథ స్వామి వారి ఆలయంలో తొలిసారిగా అంగరంగ వైభవంగా బంగారు గరుడ వాహన సేవ నిర్వహించనున్నారు. భక్తుల కోసం ప్రత్యేకంగా చేపట్టిన ఈ కార్యక్రమం ఆలయ చరిత్రలో ఓ కీలక ఘట్టంగా నిలిచే అవకాశం ఉంది.ఈ సేవ సందర్భంగా స్వామివారిని బంగారు గరుడ వాహనంపై ఊరేగింపుగా మంగళవాయిద్యాల నడుమ ఆలయ ప్రాంగణంలో విహరించనున్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ పవిత్ర కార్యక్రమాన్ని సాక్షాత్కరించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.