విశాఖపట్నం సెప్టెంబర్ 23
పూర్ణ మార్కెట్ సమీపంలోని శ్రీ దుర్గాలమ్మ అమ్మవారి ఆలయంలో శ్రీ దేవీ శరన్నవరాత్రులు ఘనంగా జరుగుతున్నాయి.వచ్చే నెల రెండో తేదీ వరకు శరన్నవరాత్రి మహోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పైలా శేఖర్ బాబు చెప్పారు.శ్రీ దుర్గాలమ్మ అమ్మవారు మంగళవారం శ్రీ గాయిత్రీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. భక్తులు ఉదయం నుండి అమ్మవారికి కుంకుమార్చనలు,విశేష పూజలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో శ్రీ అమ్మవారిని దర్శించుకుని కుంకుమ పూజల్లో పాల్గొన్నారు. బుధవారం శ్రీ అమ్మవారు అన్నపూర్ణా దేవిగా భక్తులకు దర్శనమిస్తారు.

శ్రీ గాయిత్రీ దేవి అలంకారంలో శ్రీ దుర్గాలమ్మ
విశాఖపట్నం సెప్టెంబర్ 23 పూర్ణ మార్కెట్ సమీపంలోని శ్రీ దుర్గాలమ్మ అమ్మవారి ఆలయంలో శ్రీ దేవీ శరన్నవరాత్రులు ఘనంగా జరుగుతున్నాయి.వచ్చే నెల రెండో తేదీ వరకు శరన్నవరాత్రి మహోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పైలా శేఖర్ బాబు చెప్పారు.శ్రీ దుర్గాలమ్మ అమ్మవారు మంగళవారం శ్రీ గాయిత్రీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. భక్తులు ఉదయం నుండి అమ్మవారికి కుంకుమార్చనలు,విశేష పూజలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో శ్రీ అమ్మవారిని దర్శించుకుని కుంకుమ పూజల్లో పాల్గొన్నారు. బుధవారం శ్రీ అమ్మవారు అన్నపూర్ణా దేవిగా భక్తులకు దర్శనమిస్తారు.

