భక్తుల రద్దీ – ప్రత్యేక దర్శనంతో ఆధ్యాత్మిక వాతావరణం
కామారెడ్డి, 11 నవంబర్, ( పున్నమి ప్రతినిధి ). :
రామారెడ్డి మండలం, ఇసనపల్లి గ్రామ శివారులో వెలసిన శ్రీ కాలభైరవ స్వామి ఆలయంలో మంగ ళవారం సింధూర పూజలు వైభవంగా జరిగాయి. తెల్లవారుజామున నుంచే భక్తులు పెద్ద ఎత్తున నలుమూలల నుండి వివిధ మార్గాలగుండా ఆలయానికి చేరుకున్నారు.స్వామివారిని దర్శించు కున్నారు. ఆలయ ప్రాంగణం భక్తిజన సందోహంతో కిక్కిరిసిపోయింది. ఆలయ ప్రధాన అర్చకులు శ్రీనివాస్ శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు, అష్టోత్తర పూజలు నిర్వహించారు. గంటల నాదం, మంత్రోచ్చారణలతో ఆలయ పరిస రాలు ఆధ్యాత్మికతతో నిండిపోయాయి. కుటుంబ శాంతి, ఆరోగ్యం, రోగ నివారణ కోసం భక్తులు సింధూర పూజల్లో పాల్గొని సంకల్పాలు చేశారు. స్థానిక ధర్మకర్తల మండలి సభ్యులు, గ్రామ పెద్దలు నిర్వాహణలో ముందుండి కార్యక్రమాలను పర్యవే క్షించారు. స్వచ్ఛంద సేవకులు రద్దీని సమర్థంగా నియంత్రించారు. భక్తుల సౌకర్యార్థం ట్రాఫిక్ నియంత్రణ, నీటి సరఫరా, ప్రసాదాల పంపిణీకి అధికారులు సహకరించారు.కార్తీక మాసం సంద ర్భంగా ఆలయంలో ప్రతిరోజూ నిత్యపూజలు, ప్రత్యేక ఉత్సవాలు, తీర్థప్రదాన కార్యక్రమాలు జరుగుతున్నాయి. సమీప గ్రామాలతో పాటు దూర ప్రాంతాల నుండి భక్తులు భారీగా తరలి వచ్చి ఆలయ మహాత్మ్యాన్ని అనుభవించారు. అనంత రం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమం లో భక్తులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు


