— పున్నమి ప్రతినిధి
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోట నుంచి బ్లూబర్డ్ బ్లాక్-2 శాటిలైట్ ప్రయోగానికి సంబంధించిన కౌంట్‌డౌన్‌ను ప్రారంభించింది. మంగళవారం ఉదయం 8:54 గంటలకు ఈ ప్రక్రియ మొదలైంది. షెడ్యూల్ ప్రకారం బుధవారం ఉదయం సరిగ్గా 8:54 గంటలకు ఈ ప్రయోగం జరగనుంది. ఇస్రో అత్యంత శక్తివంతమైన LVM3-M6 రాకెట్ ద్వారా ఈ ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపనుంది.


