- శ్రీసిటీలో కరోనా అవగాహన పోస్టర్ల విడుదల
శ్రీసిటీ, మే 11, 2020:
పరిశ్రమల ఉత్పత్తుల పునః ప్రారంభాన్ని పురస్కరించుకుని, కరోనావైరస్ వ్యాప్తి నివారణపై పరిశ్రమల ఎగ్జిక్యూటివ్ లు, కార్మికుల మధ్య అహగాహన కల్పించేందుకు, స్థానిక వైటల్ పేపర్స్ పరిశ్రమ యాజమాన్యం సహకారంతో శ్రీసిటీ కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు అవసరమైన సమాచార పోస్టర్లను విడుదల చేసింది.
సోమవారం ఉదయం స్థానిక బిజినెస్ సెంటర్లో శ్రీసిటీ డెవలప్మెంట్ కమిషనర్ ఆర్.ముత్తురాజ్, డీఎస్పీ విమలకుమారి లాంఛనంగా పోస్టర్లను విడుదల చేశారు. పరిశ్రమ వర్గాలకు సరైన సమాచారంతో అవగాహన కల్పించడం, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ జారీ చేస్తున్న సలహాల ప్రకారం జాగ్రత్తలు తీసుకోవడం ఈ వైరస్ వ్యాప్తిని నివారించడంలో ఇందులో ముఖ్యమైన అంశాలుగా పేర్కొన్నారు.
కోవిడ్ లక్షణాలు, దాని వ్యాప్తిని నివారించే పద్ధతులు, సామాజిక దూరం ప్రాముఖ్యత, వ్యక్తిగత పరిశుభ్రతను కాపాడటం వంటి సమాచారాన్ని పోస్టర్లలో వివరించారు. శ్రీసిటీలోని అన్ని యూనిట్లకు దీనిని పంపిణీ చేయడంతో పాటు పలు ముఖ్యమైన ప్రదేశాలలో దీనిని ప్రదర్శించనున్నట్లు శ్రీసిటీ ప్రతినిధులు తెలిపారు.