Wednesday, 30 July 2025
  • Home  
  • శ్రీసిటీని పర్యావరణ హిత నగరంగా తీర్చిదిద్దేందుకు సుస్థిర చర్యలు
- Featured - ఆంధ్రప్రదేశ్

శ్రీసిటీని పర్యావరణ హిత నగరంగా తీర్చిదిద్దేందుకు సుస్థిర చర్యలు

శ్రీసిటీని పర్యావరణ హిత నగరంగా తీర్చిదిద్దేందుకు సుస్థిర చర్యలు  – నిర్మాణ పనులలో ఎం-సాండ్ వినియోగం, మట్టి పునర్వినియోగంపై మార్గదర్శకాలు     ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి (APPCB) ఛైర్మన్ డా. పి. కృష్ణయ్యతో ఇటీవల చర్చల అనంతరం, శ్రీసిటీని మరింత పర్యావరణ హిత నగరంగా తీర్చిదిద్దేందుకు, శ్రీసిటీ యాజమాన్యం తన పారిశ్రామిక భాగస్వామ్యులతో కలిసి స్థిరమైన వనరుల వినియోగ విధానాలను మరింత బలోపేతం చేస్తోంది. “రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్ ” అనే వృత్తాకార ఆర్థిక వ్యవస్థ (సర్క్యులర్ ఎకానమీ) మూల సూత్రాల ఆధారంగా పర్యావరణ హాని గణనీయంగా తగ్గించే చర్యలు చేపడుతోంది.    ఇందులో భాగంగా అన్ని నివాస, వాణిజ్య, పారిశ్రామిక ప్రాజెక్టుల నిర్మాణ పనులలో నది ఇసుక వాడకానికి ప్రత్యామ్నాయమైన ఎం-సాండ్ (గ్రానైట్ రాళ్లను పొడిచేయడం ద్వారా తయారయ్యే ఇసుక) ను విధిగా 90 శాతం ఉపయోగించాలని, నది ఇసుక వినియోగాన్ని కేవలం 10 శాతానికి  పరిమితం చేయాలని నిర్ణయించింది. మరియు, ఫిల్లింగ్ కొరకు బయట మట్టిని కొనుగోలు చేయడం తగ్గించి, ఆయా ప్లాట్లలో తవ్విన మట్టినే ఉపయోగించే  విధానాన్ని ప్రోత్సహించనున్నారు. దీనితో పాటు, భూఉపరితలాన్నీ సమర్థవంతంగా నిర్వహించి, వర్షపు నీటి సంరక్షణ, నీటి నిల్వ సమస్యలకు తగు ఉత్తమ పరిష్కారాలు చూపనున్నారు.   శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ డా. రవీంద్ర సన్నారెడ్డి దీనిపై వ్యాఖ్యానిస్తూ, హరిత నగర లక్ష్యాన్ని సాధించే దిశగా సుస్థిర వనరుల నిర్వహణ మరియు పర్యావరణహిత కార్యకలాపాలను అమలు చేయడంలో శ్రీసిటీ ఎప్పుడూ ముందుందన్నారు. సర్క్యులర్ ఎకానమీ సూత్రాలను అవలంభించడం ద్వారా స్థిరమైన పారిశ్రామిక వృద్ధికి దోహదపడే చర్యలను అమలు చేస్తున్నామని చెప్పారు.    అంతేకాక, పునరుత్పాదక ఇంధన వినియోగాన్ని పెంపొందించడం, భారీ స్థాయిలో వర్ష జల సంరక్షణ, నీటి పునర్వినియోగం, భూగర్భజల రక్షణ, జీరోవేస్ట్ విధానాల అమలు, పరిశ్రమల పరస్పర సహకార వ్యవస్థ, మొత్తం విస్తీర్ణంలో 40% హరిత పరిసరాలను అభివృద్ధి చేయడం వంటి కార్యక్రమాలు శ్రీసిటీ అభివృద్ధి వ్యూహంలో భాగంగా తాము కొనసాగిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.   కాలుష్య రహిత ఇంధన (క్లీన్ ఎనర్జీ) వినియోగాన్ని వేగవంతం చేసేందుకు,  AG&P పైప్‌లైన్ నెట్‌వర్క్ ద్వారా కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ (సి.ఎన్.జి)ను శ్రీసిటీ అందుబాటులోకి తెస్తోంది. తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాన్ని అందించే ఈ పద్ధతి వల్ల ఉత్పత్తి నాణ్యత మెరుగుపడటమే కాకుండా, బొగ్గు వాడకంతో ఏర్పడే పొల్యూషన్ బెడదను అరికడుతుంది. పారిశ్రామిక సంస్థలు వీలైనంత త్వరగా సి.ఎన్.జి. కి మారడం ద్వారా ఈ ప్రయోజనాలను అందిపుచ్చుకోవాలని శ్రీసిటీ ఎండీ సూచించారు.    ఈ నూతన విధానాల అమలు ద్వారా పారిశ్రామికాభివృద్ధికి,  పర్యావరణ పరిరక్షణకు మధ్య సమతుల్యతను నెలకొల్పి, ప్రముఖ సుస్థిర పారిశ్రామిక కేంద్రమైన శ్రీసిటీ తన నిబద్ధతను చాటుకుంటోంది. 

శ్రీసిటీని పర్యావరణ హిత నగరంగా తీర్చిదిద్దేందుకు సుస్థిర చర్యలు 
– నిర్మాణ పనులలో ఎం-సాండ్ వినియోగం, మట్టి పునర్వినియోగంపై మార్గదర్శకాలు
 
 
ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి (APPCB) ఛైర్మన్ డా. పి. కృష్ణయ్యతో ఇటీవల చర్చల అనంతరం, శ్రీసిటీని మరింత పర్యావరణ హిత నగరంగా తీర్చిదిద్దేందుకు, శ్రీసిటీ యాజమాన్యం తన పారిశ్రామిక భాగస్వామ్యులతో కలిసి స్థిరమైన వనరుల వినియోగ విధానాలను మరింత బలోపేతం చేస్తోంది. “రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్ ” అనే వృత్తాకార ఆర్థిక వ్యవస్థ (సర్క్యులర్ ఎకానమీ) మూల సూత్రాల ఆధారంగా పర్యావరణ హాని గణనీయంగా తగ్గించే చర్యలు చేపడుతోంది. 
 
ఇందులో భాగంగా అన్ని నివాస, వాణిజ్య, పారిశ్రామిక ప్రాజెక్టుల నిర్మాణ పనులలో నది ఇసుక వాడకానికి ప్రత్యామ్నాయమైన ఎం-సాండ్ (గ్రానైట్ రాళ్లను పొడిచేయడం ద్వారా తయారయ్యే ఇసుక) ను విధిగా 90 శాతం ఉపయోగించాలని, నది ఇసుక వినియోగాన్ని కేవలం 10 శాతానికి  పరిమితం చేయాలని నిర్ణయించింది. మరియు, ఫిల్లింగ్ కొరకు బయట మట్టిని కొనుగోలు చేయడం తగ్గించి, ఆయా ప్లాట్లలో తవ్విన మట్టినే ఉపయోగించే  విధానాన్ని ప్రోత్సహించనున్నారు. దీనితో పాటు, భూఉపరితలాన్నీ సమర్థవంతంగా నిర్వహించి, వర్షపు నీటి సంరక్షణ, నీటి నిల్వ సమస్యలకు తగు ఉత్తమ పరిష్కారాలు చూపనున్నారు.
 
శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ డా. రవీంద్ర సన్నారెడ్డి దీనిపై వ్యాఖ్యానిస్తూ, హరిత నగర లక్ష్యాన్ని సాధించే దిశగా సుస్థిర వనరుల నిర్వహణ మరియు పర్యావరణహిత కార్యకలాపాలను అమలు చేయడంలో శ్రీసిటీ ఎప్పుడూ ముందుందన్నారు. సర్క్యులర్ ఎకానమీ సూత్రాలను అవలంభించడం ద్వారా స్థిరమైన పారిశ్రామిక వృద్ధికి దోహదపడే చర్యలను అమలు చేస్తున్నామని చెప్పారు. 
 
అంతేకాక, పునరుత్పాదక ఇంధన వినియోగాన్ని పెంపొందించడం, భారీ స్థాయిలో వర్ష జల సంరక్షణ, నీటి పునర్వినియోగం, భూగర్భజల రక్షణ, జీరోవేస్ట్ విధానాల అమలు, పరిశ్రమల పరస్పర సహకార వ్యవస్థ, మొత్తం విస్తీర్ణంలో 40% హరిత పరిసరాలను అభివృద్ధి చేయడం వంటి కార్యక్రమాలు శ్రీసిటీ అభివృద్ధి వ్యూహంలో భాగంగా తాము కొనసాగిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
 
కాలుష్య రహిత ఇంధన (క్లీన్ ఎనర్జీ) వినియోగాన్ని వేగవంతం చేసేందుకు,  AG&P పైప్‌లైన్ నెట్‌వర్క్ ద్వారా కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ (సి.ఎన్.జి)ను శ్రీసిటీ అందుబాటులోకి తెస్తోంది. తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాన్ని అందించే ఈ పద్ధతి వల్ల ఉత్పత్తి నాణ్యత మెరుగుపడటమే కాకుండా, బొగ్గు వాడకంతో ఏర్పడే పొల్యూషన్ బెడదను అరికడుతుంది. పారిశ్రామిక సంస్థలు వీలైనంత త్వరగా సి.ఎన్.జి. కి మారడం ద్వారా ఈ ప్రయోజనాలను అందిపుచ్చుకోవాలని శ్రీసిటీ ఎండీ సూచించారు. 
 
ఈ నూతన విధానాల అమలు ద్వారా పారిశ్రామికాభివృద్ధికి,  పర్యావరణ పరిరక్షణకు మధ్య సమతుల్యతను నెలకొల్పి, ప్రముఖ సుస్థిర పారిశ్రామిక కేంద్రమైన శ్రీసిటీ తన నిబద్ధతను చాటుకుంటోంది. 

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.