ఆలమూరు,జూన్ 28,పున్నమి న్యూస్ :
ఆలమూరు మండలం చెముడులంక శ్రీషిర్డిసాయి స్కూల్లో ఎనిమిదవ తరగతి చదువుచున్న మూలస్థాన అగ్రహారంకు చెందిన బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ఇనపకోళ్ళ పట్టాభి కుమారుడు విజయ సతీష్ కుమార్ రాష్ట్రస్థాయిలో ప్రధమ ర్యాంకు సాధించాడు.సతీష్ నేషనల్ ఇంగ్లీష్ ఒలింపియిడ్ వారు ఇటీవల నిర్వహించిన (మన సంస్కృతి) అంశానికి సంబంధించిన పరీక్షలో రాష్ట్ర స్థాయి ప్రధమ ర్యాంకు వచ్చింది.ఈ మేరకు శనివారం తిరుపతిలో నేషనల్ ఇంగ్లీష్ ఒలింపియిడ్ సంస్థ నిర్వహించిన కార్యక్రమములో ప్రథమ ర్యాంకు సాధించిన విద్యార్ధి సతీష్ కుమార్ కు తిరుపతి మహిళా పోలీసు స్టేషను డిఎస్పీ ఎమ్.శ్రీలత చేతుల మీదుగా రూ.5 వేలు చెక్, ప్రశంశా పత్రంతో పాటు మెమొంటోను అందించారు. ఈ ప్రతిభ కనబరిచిన విద్యార్థిని శ్రీ షిర్డీ సాయి విద్యాసంస్థల కరస్పాండెంట్ ఉమారాణి అభినందించారు