
రాంనగర్‌లో వెలసిన శ్రీశ్రీశ్రీ దుర్గా మల్లేశ్వరి దేవస్థానంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఆలయ కమిటీ భారీ ఏర్పాట్లు చేపట్టింది. ఆలయ అధ్యక్షులు మార్గాన వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఈ నెల సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2 వరకు 11 రోజులపాటు ఉత్సవాలు జరగనున్నాయి.
ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ మార్గాన వెంకటేశ్వరరావు ఉత్తరాంధ్ర రాష్ట్రీయ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు రాజు గౌడ్ యాత తో కలిసి జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ ని ఆహ్వానించారు.
22వ తేదీ నాడు అమ్మవారి ఉత్సవ విగ్రహం విశేష ఊరేగింపుతో ప్రారంభమై, అమ్మవారు బాలత్రిపురసుందరీ దేవిగా భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఆపై ప్రతి రోజూ అమ్మవారు విభిన్న రూపాలలో అలంకరించబడతారు:
23వ తేదీ – గాయత్రి దేవి
24వ తేదీ – అన్నపూర్ణ దేవి
25వ తేదీ – కాత్యాయనీ దేవి
26వ తేదీ – లలితా త్రిపుర సుందరీ దేవి
27వ తేదీ – మహా చండీ దేవి
28వ తేదీ – మహాలక్ష్మీ దేవి
29వ తేదీ – సరస్వతి దేవి
30వ తేదీ – శ్రీ కనకదుర్గ దేవి
అక్టోబర్ 1వ తేదీ – మహిషాసురమర్ధిని దేవి
అక్టోబర్ 2వ తేదీ – రాజరాజేశ్వరి దేవి
శరన్నవరాత్రి పర్వదినాల్లో జరిగే ఈ పూజా కార్యక్రమాలు అభ్యుదయానికి, ఆధ్యాత్మికోత్సాహానికి ప్రతీకగా ఉంటాయని ఆలయ నిర్వాహకులు తెలిపారు.
ఈ సమావేశంలో మహేష్, కృష్ణ, బేకరీ రవి, పల్లా దుర్గ, తదితరులు పాల్గొన్నారు.

