నంద్యాల జూలై 28 పున్నమి ప్రతినిధి ఆర్ ఎన్ రెడ్డి:
శ్రీశైల పుణ్య క్షేత్రంకు రండి సార్ అంటూ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఆహ్వానించిన ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి
భూకైలాసంగా విరాజిల్లుతూ అష్టా దశశక్తి పీఠం, ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలలో ఒకటైన శ్రీ భ్రమరాంబ, మల్లికార్జున స్వామి వార్ల దర్శనం కోసం శ్రీశైలం రావాలని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఆహ్వానించినట్లు నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు, లోక్ సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బైరెడ్డి శబరి చెప్పారు.
సోమవారం ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి మాట్లాడుతూ తన భర్త డాక్టర్ శివచరణ్ రెడ్డితో కలిసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీనీ మర్యాద పూర్వకంగా కలిచామని, పవిత్రమైన, ఎంతో విశిష్టమైన శ్రీశైలం పుణ్య క్షేత్రాన్ని సందర్శించమని హృదయ పూర్వకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీనీ ఆహ్వానించడం జరిగిందని, ప్రధాని మోడీ సానుకూలంగా స్పందించడం ఒక గౌరవంగా భావిస్తున్నానని ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి తెలిపారు.


