Wednesday, 25 March 2026
  • Home  
  • * శ్రీశైలం నేషనల్ హైవేను పరిశీలించిన ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి *
- రంగారెడ్డి

* శ్రీశైలం నేషనల్ హైవేను పరిశీలించిన ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి *

పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి( సంగిశెట్టి ధనుంజయ్ ) నవంబర్ 22 : మహేశ్వరం నియోజకవర్గంలోని శ్రీశైలం హైవే రహదారిని జల్పల్లి మున్సిపాలిటీ ఎర్రకుంట వద్ద మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతు గతంలోనే ఈ రహదారిని నేషనల్ హైవే అథారిటీ పరిధిలోకి తీసుకుని, మహేశ్వరం నియోజకవర్గం పరిధిలోని ఉన్న రోడ్డును నాలుగు లైన్లుగా వెడల్పు చేయడానికి ₹80 కోట్లు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. అదేవిధంగా చంద్రయాన్‌గుట్ట నియోజకవర్గ పరిధిలోని 1.8 కిలోమీటర్ల మిగిలి ఉన్న రహదారి ఆర్ అండ్ బీ శాఖ ద్వారా ఇంకా ₹20 కోట్లు మంజూరైనట్లు పేర్కొన్నారు. మొత్తం ₹100 కోట్లతో చంద్రయాన్‌గుట్ట నుంచి జల్పల్లి గేట్ వరకు 5.8 కిలోమీటర్ల ఫోర్ లైన్ రోడ్డు నేషనల్ హైవే అథారిటీ నొమ్స్ ప్రకారంగా నిర్మాణం, సెంట్రల్ లైటింగ్ సిస్టమ్, డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు సిద్ధంగా ఉన్నాయని వెల్లడించారు.రోడ్డు పనులు అధికారికంగా ప్రారంభం కావడానికి కొంత సమయం పట్టినా, ప్రస్తుత రహదారి పరిస్థితులు దారుణంగా ఉన్నందున, రహదారిపై ఉన్న గోతులు, నీరు నిలిచే ప్రాంతాలను తక్షణమే సరిచేయాలని కమిషనర్‌తో పాటు సంబంధిత అధికారులను ఆమె ఆదేశించారు. ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో తాత్కాలిక మరమ్మత్తులను వెంటనే చేపట్టి, నాణ్యతతో కూడిన శాశ్వత రహదారి పనులను త్వరితగతిన ప్రారంభించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జల్పల్లి మున్సిపాలిటీకి చెందిన మాజీ ప్రజాప్రతినిధులు, మాజీ కో-ఆప్షన్ సభ్యులు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.

పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి( సంగిశెట్టి ధనుంజయ్ ) నవంబర్ 22 : మహేశ్వరం నియోజకవర్గంలోని శ్రీశైలం హైవే రహదారిని జల్పల్లి మున్సిపాలిటీ ఎర్రకుంట వద్ద మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతు గతంలోనే ఈ రహదారిని నేషనల్ హైవే అథారిటీ పరిధిలోకి తీసుకుని, మహేశ్వరం నియోజకవర్గం పరిధిలోని ఉన్న రోడ్డును నాలుగు లైన్లుగా వెడల్పు చేయడానికి ₹80 కోట్లు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. అదేవిధంగా చంద్రయాన్‌గుట్ట నియోజకవర్గ పరిధిలోని 1.8 కిలోమీటర్ల మిగిలి ఉన్న రహదారి ఆర్ అండ్ బీ శాఖ ద్వారా ఇంకా ₹20 కోట్లు మంజూరైనట్లు పేర్కొన్నారు. మొత్తం ₹100 కోట్లతో చంద్రయాన్‌గుట్ట నుంచి జల్పల్లి గేట్ వరకు 5.8 కిలోమీటర్ల ఫోర్ లైన్ రోడ్డు నేషనల్ హైవే అథారిటీ నొమ్స్ ప్రకారంగా నిర్మాణం, సెంట్రల్ లైటింగ్ సిస్టమ్, డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు సిద్ధంగా ఉన్నాయని వెల్లడించారు.రోడ్డు పనులు అధికారికంగా ప్రారంభం కావడానికి కొంత సమయం పట్టినా, ప్రస్తుత రహదారి పరిస్థితులు దారుణంగా ఉన్నందున, రహదారిపై ఉన్న గోతులు, నీరు నిలిచే ప్రాంతాలను తక్షణమే సరిచేయాలని కమిషనర్‌తో పాటు సంబంధిత అధికారులను ఆమె ఆదేశించారు. ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో తాత్కాలిక మరమ్మత్తులను వెంటనే చేపట్టి, నాణ్యతతో కూడిన శాశ్వత రహదారి పనులను త్వరితగతిన ప్రారంభించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో జల్పల్లి మున్సిపాలిటీకి చెందిన మాజీ ప్రజాప్రతినిధులు, మాజీ కో-ఆప్షన్ సభ్యులు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.