కామారెడ్డి 17 నవంబర్ పున్నమి ప్రతినిధి
శ్రీజ శ్రీరామ్ సాగర్ రెండవ దశ కాలువకు భీమ్ రెడ్డి నరసింహారెడ్డి పేరు పెట్టాలని కామారెడ్డి ఎం సి పి ఐ యు జిల్లా కమిటీ సభ్యులు డిమాండ్ చేశారు ఈ సందర్భంగా వారు ఒక ప్రకటనలు తెలుపుతూ,
నవంబర్ 19న ఇందిరాపార్క్ వద్ద ధర్నా – ఎంసిపి ఐ (యు) పార్టీ పిలుపునిచ్చారు. జరిగే ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పార్టీ కామారెడ్డి జిల్లా కమిటీ ప్రజలకు పిలుపునిచ్చింది. జిల్లా కార్యాలయంలో జరిగిన సమావేశంలో జిల్లా కార్యదర్శి జబ్బార్ మాట్లాడుతూ, వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు కామ్రేడ్ భీంరెడ్డి నరసింహారెడ్డి తెలంగాణ విముక్తి కోసం అనేక త్యాగాలు చేశారని, ఆయన నాయకత్వంలో గ్రామ స్వరాజ్యాలు ఏర్పడి లక్షల ఎకరాల భూమి పేద రైతులకు చేర్చబడ్డాయని పేర్కొన్నారు. అయ న పేరును ఎస్సారెస్పీ రెండవ దశ కాలువకు పెట్టకపోవడం సిగ్గుచేటు అని అన్నారు. తెలంగాణ సమాజానికి ఆదర్శంగా నిలిచిన ఆ యోధుడి త్యాగాలను ప్రభుత్వం గుర్తించి ట్యాంక్ బండ్ వద్ద ఆయన కాంస్య విగ్రహం, శృతి వనం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర పాఠ్యాంశాల లో తెలంగాణ రైతాంగ పోరాట యోధుల చరిత్రను చేర్చాలని కోరారు.ఈ కార్యక్రమంలో గ్రామశాఖ కార్యదర్శి సత్తయ్య, రాజమణి, నరేష్, రాజు, ఆసిఫ్, సత్యవా నరేష్ తదితరులు పాల్గొన్నారు


