పున్నమి ప్రతినిధి రామచంద్రాపురం మండలం
రామచంద్రాపురం మండలం నెన్నూరు గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ కోదండ రామస్వామి, శ్రీకృష్ణస్వామి, శ్రీ మహాగణపతి ఆలయాల కుంభాభిషేక మహోత్సవంకు చెవిరెడ్డి కుటుంబీకులు హాజరయ్యారు. గ్రామస్తుల ఆహ్వానం మేరకు తుమ్మలగుంట శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయం నుంచి శుక్రవారం చెవిరెడ్డి లక్ష్మీ, చెవిరెడ్డి హర్షిత్‌రెడ్డిలు పట్టు వస్త్రాలు తీసుకువచ్చి సమర్పించారు. ఆలయం వద్దకు చేరుకున్న చెవిరెడ్డి కుటుంబీకులకు గ్రామస్తులు సాదర స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేయించారు. చెవిరెడ్డి హర్షిత్‌రెడ్డి తన తల్లి చెవిరెడ్డి లక్ష్మీతో కలసి ఆలయంలో నూతనంగా ప్రతిష్టచేసియున్న శ్రీసీతాసమేత కోదండ రాముల వారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం గ్రామస్తులతో మాట్లాడుతూ ఆలయ వైశిష్ట్యాన్ని తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, గ్రామ పెద్దలు, ఆలయ నిర్వాహకులు పాల్గొన్నారు.



