Friday, 27 March 2026
  • Home  
  • శ్రీకాళహస్తి బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఆరంభాకం ముని ప్రసాద్ విజయం
- తిరుపతి

శ్రీకాళహస్తి బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఆరంభాకం ముని ప్రసాద్ విజయం

ఏర్పేడు, మార్చి 27 (పున్నమి న్యూస్): శ్రీకాళహస్తి పట్టణంలోని అడ్వకేట్స్ బార్ అసోసియేషన్ ఎన్నికలు శుక్రవారం అత్యంత ఉత్కంఠభరితంగా జరిగాయి. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన పోలింగ్ ప్రక్రియ సాయంత్రం 5 గంటలకు ముగిసింది. మొత్తం 172 ఓట్లకు గాను 159 ఓట్లు (సుమారు 92%) పోలయ్యాయి. బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఆరంభాకం ముని ప్రసాద్ ఘనవిజయం సాధించారు. ఆయనకు 77 ఓట్లు రాగా, తన సమీప ప్రత్యర్థి శేఖర్‌పై 30 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈ రేసులో శేఖర్‌కు 47 ఓట్లు, వెంకటా చలపతికి 30 ఓట్లు లభించినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. అదేవిధంగా, కార్యదర్శి పదవికి జరిగిన ఎన్నికలో టీ. తులసీరామ్ తన సమీప ప్రత్యర్థి కే.వీ. రమణపై స్పష్టమైన ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఫలితాల ప్రకటన అనంతరం ఎన్నికల అధికారులు నూతన కార్యవర్గాన్ని ధృవీకరించారు. నూతనంగా ఎన్నికైన ముని ప్రసాద్, తులసీరామ్‌లకు తోటి న్యాయవాదులు, మిత్రులు ఘనంగా శుభాకాంక్షలు తెలియజేశారు. బార్ అసోసియేషన్ అభివృద్ధికి, న్యాయవాదుల సంక్షేమానికి తాము కట్టుబడి ఉంటామని ఈ సందర్భంగా నూతన కార్యవర్గ సభ్యులు పేర్కొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.