శ్రీ కాళహస్తి, పిబ్రవరి 07, పున్నమి న్యూస్: శ్రీకాళహస్తి ప్రభుత్వాఏరియా ఆసుపత్రిలో శనివారం నాడు స్థానిక శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి మాతృమూర్తి బొజ్జల బృందమ్మ అకస్మిక తనిఖీలు చేయపట్టారు. ఆసుపత్రి పనితీరు, రోగులకు సమయానికి వైద్యం అందుతోందా, అందుబాటులో ఉన్న సదుపాయాలు సక్రమంగా ఉన్నాయా అనే అంశాలను ఆమె స్వయంగా పరిశీలించారు. శానిటైజేషన్, బాత్రూమ్స్, వార్డులు, రూమ్స్‌లోని ఎక్విప్మెంట్స్‌ను పరిశీలించి, రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని వైద్యశాల సిబ్బందికి సూచనలు చేశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులు, వారి కుటుంబ సభ్యులతో బొజ్జల బృందమ్మ ముచ్చటించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఏ చిన్న ఇబ్బంది ఉన్నా వెంటనే తమాకు తెలియలని, తాము ఎప్పుడూ అందుబాటులో ఉంటాం అంటూ రోగులకు భరోసా ఇచ్చారు. రోగుల ఆరోగ్య పరిస్థితులపై ఆరా తీసిన ఆమె, డాక్టర్లు అందిస్తున్న వైద్యం గురించి కూడా వివరాలు తెలుసుకుని సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా ఇలాంటి తనిఖీలు కొనసాగుతాయని ఆమె స్పష్టం చేశారు.

శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రిలో బొజ్జల బృందమ్మ అకస్మిక తనిఖీలు