Tuesday, 31 March 2026
  • Home  
  • శ్రీకాళహస్తి అభివృద్ధికి నా వంతు కృషిచేస్తా-ఏపీ 20 సూత్రాల కమిటీ చైర్మన్ లంకా దినకర్
- తిరుపతి

శ్రీకాళహస్తి అభివృద్ధికి నా వంతు కృషిచేస్తా-ఏపీ 20 సూత్రాల కమిటీ చైర్మన్ లంకా దినకర్

శ్రీకాళహస్తి, మార్చి 31 (పున్నమి న్యూస్): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 20 సూత్రాల పథకాల పర్యవేక్షణ కమిటీ చైర్మన్ (క్యాబినెట్ మంత్రి హోదా) లంకా దినకర్ బుధవారం నాడు శ్రీకాళహస్తిని సందర్శించారు. స్థానిక ఎంజీఎం గ్రాండ్ హోటల్‌కు విచ్చేసిన ఆయనకు ఎంజీఎం గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ గుడ్లూరు మయూర్, ఆయన తండ్రి గుడ్లూరు మల్లికార్జున్ నాయుడు ఘనస్వాగతం పలికి, ఘనంగా సత్కరించారు. అనంతరం శ్రీకాళహస్తి క్షేత్రంలో స్వామి, అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన లంకా దినకర్, తిరిగి ఎంజీఎం గ్రాండ్ హోటల్‌లో బస చేసి వారి ఆతిథ్యాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా లంకా దినకర్ మాట్లాడుతూ.. ఎంజీఎం కుటుంబంతో తనకు దశాబ్దాల కాలంగా చిరకాల స్నేహం ఉందన్నారు. శ్రీకాళహస్తి ప్రాంతం పారిశ్రామికంగా, ఆధ్యాత్మికంగా, వ్యవసాయ, విద్యాపరంగా అభివృద్ధి చెందడానికి కేంద్ర బిందువుగా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. స్థానిక శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డితో కలిసి శ్రీకాళహస్తి నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి తన వంతు సహకారాన్ని అందిస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ భేటీలో డాక్టర్ గుడ్లూరు మయూర్ పలు కీలక అభివృద్ధి అంశాలను చైర్మన్ దృష్టికి తీసుకెళ్లగా, సుమారు రెండు గంటల పాటు వివిధ విషయాలపై వారు చర్చించారు. ఈ కార్యక్రమంలో ఎంజీఎం గ్రూప్ ప్రతినిధులు, ఇతర ముఖ్యులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.