శ్రీకాళహస్తి, ఏప్రిల్ 12 (పున్నమి న్యూస్) శ్రీకాళహస్తి, ఏప్రిల్: డాక్టర్ B. R. అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా శ్రీకాళహస్తి పట్టణంలో ఘనంగా వేడుకలు నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా అంబేద్కర్ భవన్ కమిటీ మరియు SC, ST ఎంప్లాయిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జయంతి పోస్టర్ను ఆవిష్కరించారు. ఏప్రిల్ 14న అంబేద్కర్ భవన్లో జరగబోయే జయంతి కార్యక్రమానికి ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, కర్షకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు సహా ప్రతి ఒక్కరూ పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు. సామాజిక న్యాయం కోసం అహర్నిశలు కృషి చేసిన అంబేద్కర్ సేవలను స్మరించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. ఆయన చేసిన త్యాగాలకు కృతజ్ఞతగా జయంతి వేడుకల్లో పాల్గొనడం ద్వారా నివాళి అర్పించాలని కోరారు. ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో జి. శ్రీనివాసులు, వై. శ్రీహరి, ఎన్. రామకృష్ణయ్య, జి. రామ్మూర్తి, గోపి, భాను ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.

శ్రీకాళహస్తి అంబేద్కర్ భవన్లో జయంతి సంబరాలు… ప్రజలకు ఆహ్వానం