Sunday, 15 February 2026
  • Home  
  • శ్రీకాళహస్తిలో సంగీత విభావరి.. కోటి స్వరార్చనకు భక్తులు పరవశం
- తిరుపతి

శ్రీకాళహస్తిలో సంగీత విభావరి.. కోటి స్వరార్చనకు భక్తులు పరవశం

శ్రీకాళహస్తి పున్నమి టెంపుల్ న్యూస్, ఫిబ్రవరి 15: శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు పట్టణంలో ఆధ్యాత్మిక శోభను నింపుతున్నాయి. ఇందులో భాగంగా ఆదివారం రాత్రి స్థానిక ధూర్జటి కళా ప్రాంగణంలో ప్రముఖ సినీ సంగీత ర్శకులు కోటి, వారి బృందం నిర్వహించిన సంగీత ప్రదర్శన భక్తులను మంత్రముగ్ధులను చేసింది. ఆధ్యాత్మిక సాగరంలో మునిగితేలిన భక్తులు కోటి తన బృందంతో కలిసి ఆలపించిన ఆధ్యాత్మిక గీతాలు, శివతత్వ కీర్తనలు ప్రాంగణమంతా భక్తి పారవశ్యాన్ని నింపాయి. తనదైన శైలిలో హుషారైన, అదే సమయంలో భక్తితో కూడిన సంగీతాలాపనతో ఆయన భక్తులను మైమరిపించారు. కళా ప్రాంగణం కిక్కిరిసిపోగా, భక్తులు చప్పట్లతో సంగీత దర్శకుడిని ఉత్సాహపరిచారు. కార్యక్రమం అనంతరం ఆలయ ధర్మకర్తల మండలి అధ్యక్షులు కొట్టే సాయి ప్రసాద్, బోర్డు సభ్యులు, ఆలయ అధికారులు కోటిని ప్రత్యేకంగా గౌరవిస్తు ఆయనను దుశ్శాలువాతో ఘనంగా సత్కరించారు. అనంతరం శ్రీకాళహస్తీశ్వర స్వామి, అమ్మవార్ల తీర్థ ప్రసాదాలను అందజేశారు.

శ్రీకాళహస్తి పున్నమి టెంపుల్ న్యూస్, ఫిబ్రవరి 15: శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు పట్టణంలో ఆధ్యాత్మిక శోభను నింపుతున్నాయి. ఇందులో భాగంగా ఆదివారం రాత్రి స్థానిక ధూర్జటి కళా ప్రాంగణంలో ప్రముఖ సినీ సంగీత ర్శకులు కోటి, వారి బృందం నిర్వహించిన సంగీత ప్రదర్శన భక్తులను మంత్రముగ్ధులను చేసింది.
ఆధ్యాత్మిక సాగరంలో మునిగితేలిన భక్తులు
కోటి తన బృందంతో కలిసి ఆలపించిన ఆధ్యాత్మిక గీతాలు, శివతత్వ కీర్తనలు ప్రాంగణమంతా భక్తి పారవశ్యాన్ని నింపాయి. తనదైన శైలిలో హుషారైన, అదే సమయంలో భక్తితో కూడిన సంగీతాలాపనతో ఆయన భక్తులను మైమరిపించారు. కళా ప్రాంగణం కిక్కిరిసిపోగా, భక్తులు చప్పట్లతో సంగీత దర్శకుడిని ఉత్సాహపరిచారు. కార్యక్రమం అనంతరం ఆలయ ధర్మకర్తల మండలి అధ్యక్షులు కొట్టే సాయి ప్రసాద్, బోర్డు సభ్యులు, ఆలయ అధికారులు కోటిని ప్రత్యేకంగా గౌరవిస్తు ఆయనను దుశ్శాలువాతో ఘనంగా సత్కరించారు. అనంతరం శ్రీకాళహస్తీశ్వర స్వామి, అమ్మవార్ల తీర్థ ప్రసాదాలను అందజేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.