శ్రీకాళహస్తి పున్నమి టెంపుల్ న్యూస్, ఫిబ్రవరి 20: శ్రీకాళహస్తి క్షేత్రం అంతర్జాతీయ ఆధ్యాత్మిక కేంద్రంగా మారుతోంది. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల వేళ ముక్కంటి దర్శనానికి భక్తులు పోటెత్తుతుండగా శుక్రవారం నాడు విదేశీ భక్తుల సందడి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రష్యా, జర్మనీ దేశాలకు చెందిన సుమారు 200 మంది భక్తులు స్వామి, అమ్మవార్లను దర్శించుకుని భక్తిపారవశ్యంలో మునిగిపోయారు. ఆధ్యాత్మిక సాగరంలో విదేశీయులు ఆలయానికి చేరుకున్న విదేశీ ప్రతినిధుల బృందం, సంప్రదాయ దుస్తులు ధరించి క్రమశిక్షణతో దర్శనం చేసుకున్నారు. శ్రీకాళహస్తీశ్వరుని మహిమను, ఆలయ విశిష్టతను తెలుసుకున్న వీరు, స్వామివారికి నిర్వహించిన ప్రత్యేక పూజలు, అభిషేకాల్లో పాల్గొన్నారు. అనంతరం జ్ఞానప్రసూనాంబ అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
భారతీయ ఆధ్యాత్మికత, యోగా, శివతత్వంపై ఉన్న ఆసక్తితో తాము ఇక్కడికి వచ్చినట్లు భక్తులు తెలిపారు. ఆలయ శిల్పకళా చాతుర్యాన్ని చూసి వారు అబ్బురపడ్డారు. ఆలయ అధికారులు వారికి స్వామివారి తీర్థప్రసాదాలను అందించి, క్షేత్ర ప్రాశస్త్యాన్ని వివరించారు.

శ్రీకాళహస్తిలో విదేశీయుల శివనామస్మరణ-ముక్కంటి సేవలో రష్యా, జర్మనీ భక్తులు
శ్రీకాళహస్తి పున్నమి టెంపుల్ న్యూస్, ఫిబ్రవరి 20: శ్రీకాళహస్తి క్షేత్రం అంతర్జాతీయ ఆధ్యాత్మిక కేంద్రంగా మారుతోంది. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల వేళ ముక్కంటి దర్శనానికి భక్తులు పోటెత్తుతుండగా శుక్రవారం నాడు విదేశీ భక్తుల సందడి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రష్యా, జర్మనీ దేశాలకు చెందిన సుమారు 200 మంది భక్తులు స్వామి, అమ్మవార్లను దర్శించుకుని భక్తిపారవశ్యంలో మునిగిపోయారు. ఆధ్యాత్మిక సాగరంలో విదేశీయులు ఆలయానికి చేరుకున్న విదేశీ ప్రతినిధుల బృందం, సంప్రదాయ దుస్తులు ధరించి క్రమశిక్షణతో దర్శనం చేసుకున్నారు. శ్రీకాళహస్తీశ్వరుని మహిమను, ఆలయ విశిష్టతను తెలుసుకున్న వీరు, స్వామివారికి నిర్వహించిన ప్రత్యేక పూజలు, అభిషేకాల్లో పాల్గొన్నారు. అనంతరం జ్ఞానప్రసూనాంబ అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. భారతీయ ఆధ్యాత్మికత, యోగా, శివతత్వంపై ఉన్న ఆసక్తితో తాము ఇక్కడికి వచ్చినట్లు భక్తులు తెలిపారు. ఆలయ శిల్పకళా చాతుర్యాన్ని చూసి వారు అబ్బురపడ్డారు. ఆలయ అధికారులు వారికి స్వామివారి తీర్థప్రసాదాలను అందించి, క్షేత్ర ప్రాశస్త్యాన్ని వివరించారు.

