శ్రీకాళహస్తి పున్నమి టెంపుల్ న్యూస్, ఫిబ్రవరి 15: మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని దక్షిణ కాశీగా పేరొందిన శ్రీకాళహస్తి ముక్కంటి ఆలయం భక్తజన సంద్రమైంది. పరమశివుని దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు భారీగా తరలివచ్చారు. అయితే, ఆలయ అధికారుల వైఫల్యం, వీఐపీలకే అధిక ప్రాధాన్యం ఇవ్వడంపై సాధారణ భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముక్కంటి దర్శనం కోసం భక్తులు ఆదివారం తెల్లవారుజామున 2 గంటల నుంచే క్యూలైన్లలో వేచి ఉన్నారు. గంటలు గడుస్తున్నా క్యూలైన్ కదలకపోవడం, కనీస సౌకర్యాలు లేకపోవడంతో వృద్ధులు, చిన్నారులు తీవ్ర అవస్థలు పడ్డారు. గంటలతరబడి వేచి ఉన్నా తమను దర్శనానికి అనుమతించడం లేదని భక్తులు వాపోయారు.
అధికారులతీరుపైనిరసన..
సాధారణ భక్తులను నిలిపివేసి, సిఫార్సు లేఖలు ఉన్న వీఐపీలను గర్భాలయంలోకి పంపడంపై భక్తుల సహనం నశించింది. ఆలయ ప్రాంగణంలోనే అధికారుల తీరుకు వ్యతిరేకంగా భక్తులు నిరసనకు దిగారు. “ఛైర్మన్ డౌన్ డౌన్.. ఈవో డౌన్ డౌన్” అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేయడంతో ఆలయ పరిసరాల్లో ఉద్రిక్తత నెలకొంది. క్యూలైన్ల నిర్వహణలో సమన్వయ లోపం స్పష్టంగా కనిపిస్తోందని, సామాన్య భక్తుల గోడు పట్టించుకునే వారే లేరని ఆవేదన వ్యక్తం చేశారు.
పోలీసులజోక్యం..
ఆందోళన ఉధృతం కావడంతో పోలీసులు రంగప్రవేశం చేసి భక్తులను శాంతింపజేసే ప్రయత్నం చేశారు. దర్శన ప్రక్రియను వేగవంతం చేస్తామని హామీ ఇవ్వడంతో పరిస్థితి కొంత సద్దుమణిగింది. అయినప్పటికీ, పవిత్రమైన శివరాత్రి రోజున కూడా గంటల తరబడి వేచి ఉండాల్సి రావడంపై భక్తులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

శ్రీకాళహస్తిలో భక్తుల ‘రుద్ర’ రూపం: వీఐపీలకే పెద్దపీట..సామాన్యులకు తప్పని తిప్పలు
శ్రీకాళహస్తి పున్నమి టెంపుల్ న్యూస్, ఫిబ్రవరి 15: మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని దక్షిణ కాశీగా పేరొందిన శ్రీకాళహస్తి ముక్కంటి ఆలయం భక్తజన సంద్రమైంది. పరమశివుని దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు భారీగా తరలివచ్చారు. అయితే, ఆలయ అధికారుల వైఫల్యం, వీఐపీలకే అధిక ప్రాధాన్యం ఇవ్వడంపై సాధారణ భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముక్కంటి దర్శనం కోసం భక్తులు ఆదివారం తెల్లవారుజామున 2 గంటల నుంచే క్యూలైన్లలో వేచి ఉన్నారు. గంటలు గడుస్తున్నా క్యూలైన్ కదలకపోవడం, కనీస సౌకర్యాలు లేకపోవడంతో వృద్ధులు, చిన్నారులు తీవ్ర అవస్థలు పడ్డారు. గంటలతరబడి వేచి ఉన్నా తమను దర్శనానికి అనుమతించడం లేదని భక్తులు వాపోయారు. అధికారులతీరుపైనిరసన.. సాధారణ భక్తులను నిలిపివేసి, సిఫార్సు లేఖలు ఉన్న వీఐపీలను గర్భాలయంలోకి పంపడంపై భక్తుల సహనం నశించింది. ఆలయ ప్రాంగణంలోనే అధికారుల తీరుకు వ్యతిరేకంగా భక్తులు నిరసనకు దిగారు. “ఛైర్మన్ డౌన్ డౌన్.. ఈవో డౌన్ డౌన్” అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేయడంతో ఆలయ పరిసరాల్లో ఉద్రిక్తత నెలకొంది. క్యూలైన్ల నిర్వహణలో సమన్వయ లోపం స్పష్టంగా కనిపిస్తోందని, సామాన్య భక్తుల గోడు పట్టించుకునే వారే లేరని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులజోక్యం.. ఆందోళన ఉధృతం కావడంతో పోలీసులు రంగప్రవేశం చేసి భక్తులను శాంతింపజేసే ప్రయత్నం చేశారు. దర్శన ప్రక్రియను వేగవంతం చేస్తామని హామీ ఇవ్వడంతో పరిస్థితి కొంత సద్దుమణిగింది. అయినప్పటికీ, పవిత్రమైన శివరాత్రి రోజున కూడా గంటల తరబడి వేచి ఉండాల్సి రావడంపై భక్తులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

