శ్రీకాళహస్తి, మార్చి 24 (పున్నమి న్యూస్): శ్రీకాళహస్తి నియోజకవర్గంలో పారిశుద్ధ్య నిర్వహణను మరింత మెరుగుపర్చే దిశగా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి కీలక చర్యలు చేపట్టారు. కోక కోలా సంస్థ సిఎస్ఆర్ నిధులతో రూ. 12 లక్షల వ్యయంతో మూడు గార్బేజ్ ఆటోలను మంగళవారం నాడు ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్బంగా సుదీర్ రెడ్డి మాట్లాడుతూ… సామాజిక బాధ్యతతో ప్రాంత అభివృద్ధికి సహకరిస్తున్న సంస్థలను అభినందించారు. రాబోయే రోజుల్లో మరిన్ని మౌలిక వసతులు కల్పించి శ్రీకాళహస్తిని ఆదర్శప్రాయ ప్రాంతంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. శ్రీకాళహస్తి మండలంలోని కాపుగున్నేరి, చెర్లోపల్లి, తొండమనాడు గ్రామాలకు ఒక్కొక్కటి చొప్పున ఒక్కో వాహనం విలువ రూ. 4 లక్షలు ఈ ఆటోలను కేటాయించారు. తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించడం ద్వారా గ్రామాల్లో పరిశుభ్రతను పెంపొందించడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమనీ ప్రజలు కూడా పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడంలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. పరిశుభ్రమైన వాతావరణం ద్వారా ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని అయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, వివిధ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

శ్రీకాళహస్తిలో పారిశుద్ధ్యానికి బలం – సిఎస్ఆర్ నిధులతో గార్బేజ్ ఆటోలు ప్రారంభం