శ్రీకాకుళం జిల్లాలో కిడ్నీ వ్యాధులపై సమగ్ర అధ్యయనం:డాక్టర్ టి. రవిరాజు వెల్లడి *విశాఖపట్నం నవంబర్ పున్నమి ప్రతినిధి* శ్రీకాకుళం జిల్లాలోని తీర ప్రాంత మండలాల్లో కిడ్నీ వ్యాధులపై సమగ్ర అధ్యయనం ప్రారంభించామని కిడ్నీ వ్యాధుల పరిశోధన ప్రాజెక్టు మెంటర్, ప్రముఖ నెఫ్రాలజిస్ట్, డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ మాజీ వీసీ, రిటైర్డ్ డైరెక్టర్ అఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ టి.రవిరాజు తెలియజేశారు. శుక్రవారం ఆంధ్ర వైద్య కళాశాల డాక్టర్ అంబేద్కర్ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతంలో 18 శాతం జనాభా కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్నట్లు తమ పరిశోధనలో వెల్లడైందని ఈ నేపథ్యంలోనే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ కిడ్నీ వ్యాధులపై పరిశోధనలకు అనుమతి ఇచ్చిందని మూడేళ్లలో ఈ ప్రాజెక్టు పూర్తి అవుతుందని పేర్కొన్నారు. ఇందుకు 6.01 కోట్ల రూపాయలు కేటాయించినట్లు వివరించారు. ఉద్దానం ప్రాంతంలోని ఇచ్చాపురం కవిటి, కంచిలి, మందస, పలాస, వజ్రపుకొత్తూరు మండలాల్లో అధ్యయనం జరుగుతుందని చెప్పారు. ఈనెల 1వ తేదీ నుండి ఈ ప్రక్రియ లాంఛనంగా మొదలయిందని వివరించారు. శాంపిల్ సర్వేలో భాగంగా రక్త, మూత్ర పరీక్షలు నిర్వహిస్తామని వాటిని ఆంధ్ర వైద్య కళాశాలలో కోటి రూపాయల వ్యయంతో ఏర్పాటుచేసిన ల్యాబ్ లో నిర్వహిస్తామని వివరించారు. కిడ్నీ వ్యాధులు తీవ్రతరం కాకుండా కొత్తగా మూడు రకాల మందులు వచ్చాయని వ్యాధి ప్రారంభ దశలో వాటిని వాడినట్లయితే వ్యాధి అదుపులో ఉంటుందని పేర్కొన్నారు అయితే ఈ కిడ్నీ వ్యాధులు ఏ కారణాల వల్ల వస్తున్నాయో తెలియడం లేదని ముఖ్యంగా పంటల్లో పురుగుల మందులు వాడడం, నీటి కాలుష్యం, మధుమేహం వల్ల వస్తున్నట్లు పరిశోధనల్లో తెలుస్తోందని వివరించారు. 1990 చివర్లో శ్రీకాకుళం జిల్లాలోని తీరప్రాంత మండలాల్లో మూత్రపిండ వ్యాధిని గుర్తించినట్లు పేర్కొంటూ మళ్లీ వ్యాధి ప్రబలకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ కొత్త ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వివరించారు. దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి నియంత్రణ ధ్యేయంగా తమ పరిశోధనలు సాగుతాయని తుది నివేదికలో కూడా పలు విషయాలు పొందుపరుస్తామని డాక్టర్ రవిరాజు పేర్కొన్నారు.
కిడ్నీ వ్యాధుల మూలాలు కనుగొనడం ద్వారా ఉద్దానం ప్రాంతంలో అవసరమైన చర్యలు తీసుకోవడానికి వీలవుతుందని
తొలి విడతలో 5,500 మంది నుండి నమూనాలు సేకరిస్తామని తెలిపారు.వైద్య ఆరోగ్య శాఖ ఆదేశాల మేరకు తాము పంపిన ప్రతిపాదనలు పరిగణనలోనికి తీసుకుని పరిశోధనకు ఐసీఎంఆర్ ఆమోదం తెలిపిందన్నారు.శాస్త్రీయ విధానంలో 18 ఏళ్లకు పైబడిన వారి నమూనాలు సేకరిస్తామని ఆధునిక బయోమార్కర్స్ విధానంలో పరీక్షిస్తామన్నారు. దీనివల్ల బాధితులకు ఒకటి, రెండు సంవత్సరాల్లో కిడ్నీ సమస్య ఏ స్థాయిలో రావచ్చున్నది స్పష్టంగా తెలుస్తుందన్నారు.
ఆర్ఎన్ఏ సీక్వెన్సింగ్ విధానంలో జన్యుపరమైన పరీక్షలు కూడా ఈ పరిశోధనలో భాగంగా చేస్తామని తెలిపారు. దీనివల్ల బాధితులకు జన్యుపరంగా కిడ్నీ వ్యాధులు వస్తాయా? రావా? అని కూడా తెలుస్తుందని పేర్కొన్నారు. ఉద్దానంలోని వేరువేరు ప్రాంతాల్లో మట్టి, నీరు, గాలి, వరి, చేపలు, కూరగాయల నమూనాలు సేకరించి కూడా పరీక్షిస్తామని. వీటి ఫలితాల.ననుసరించి తదుపరి చర్యలు ఉంటాయని డాక్టర్ రవిరాజు పేర్కొన్నారు. ఈ సమావేశంలో కేజీహెచ్ కిడ్నీ వ్యాధుల విభాగాదిపతి డాక్టర్ జి. ప్రసాద్, ఆంధ్ర వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సంధ్యారాణి,వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.

శ్రీకాకుళం జిల్లాలో కిడ్నీ వ్యాధులపై సమగ్ర అధ్యయనం:డాక్టర్ టి. రవిరాజు వెల్లడి
శ్రీకాకుళం జిల్లాలో కిడ్నీ వ్యాధులపై సమగ్ర అధ్యయనం:డాక్టర్ టి. రవిరాజు వెల్లడి *విశాఖపట్నం నవంబర్ పున్నమి ప్రతినిధి* శ్రీకాకుళం జిల్లాలోని తీర ప్రాంత మండలాల్లో కిడ్నీ వ్యాధులపై సమగ్ర అధ్యయనం ప్రారంభించామని కిడ్నీ వ్యాధుల పరిశోధన ప్రాజెక్టు మెంటర్, ప్రముఖ నెఫ్రాలజిస్ట్, డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ మాజీ వీసీ, రిటైర్డ్ డైరెక్టర్ అఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ టి.రవిరాజు తెలియజేశారు. శుక్రవారం ఆంధ్ర వైద్య కళాశాల డాక్టర్ అంబేద్కర్ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతంలో 18 శాతం జనాభా కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్నట్లు తమ పరిశోధనలో వెల్లడైందని ఈ నేపథ్యంలోనే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ కిడ్నీ వ్యాధులపై పరిశోధనలకు అనుమతి ఇచ్చిందని మూడేళ్లలో ఈ ప్రాజెక్టు పూర్తి అవుతుందని పేర్కొన్నారు. ఇందుకు 6.01 కోట్ల రూపాయలు కేటాయించినట్లు వివరించారు. ఉద్దానం ప్రాంతంలోని ఇచ్చాపురం కవిటి, కంచిలి, మందస, పలాస, వజ్రపుకొత్తూరు మండలాల్లో అధ్యయనం జరుగుతుందని చెప్పారు. ఈనెల 1వ తేదీ నుండి ఈ ప్రక్రియ లాంఛనంగా మొదలయిందని వివరించారు. శాంపిల్ సర్వేలో భాగంగా రక్త, మూత్ర పరీక్షలు నిర్వహిస్తామని వాటిని ఆంధ్ర వైద్య కళాశాలలో కోటి రూపాయల వ్యయంతో ఏర్పాటుచేసిన ల్యాబ్ లో నిర్వహిస్తామని వివరించారు. కిడ్నీ వ్యాధులు తీవ్రతరం కాకుండా కొత్తగా మూడు రకాల మందులు వచ్చాయని వ్యాధి ప్రారంభ దశలో వాటిని వాడినట్లయితే వ్యాధి అదుపులో ఉంటుందని పేర్కొన్నారు అయితే ఈ కిడ్నీ వ్యాధులు ఏ కారణాల వల్ల వస్తున్నాయో తెలియడం లేదని ముఖ్యంగా పంటల్లో పురుగుల మందులు వాడడం, నీటి కాలుష్యం, మధుమేహం వల్ల వస్తున్నట్లు పరిశోధనల్లో తెలుస్తోందని వివరించారు. 1990 చివర్లో శ్రీకాకుళం జిల్లాలోని తీరప్రాంత మండలాల్లో మూత్రపిండ వ్యాధిని గుర్తించినట్లు పేర్కొంటూ మళ్లీ వ్యాధి ప్రబలకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ కొత్త ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వివరించారు. దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి నియంత్రణ ధ్యేయంగా తమ పరిశోధనలు సాగుతాయని తుది నివేదికలో కూడా పలు విషయాలు పొందుపరుస్తామని డాక్టర్ రవిరాజు పేర్కొన్నారు. కిడ్నీ వ్యాధుల మూలాలు కనుగొనడం ద్వారా ఉద్దానం ప్రాంతంలో అవసరమైన చర్యలు తీసుకోవడానికి వీలవుతుందని తొలి విడతలో 5,500 మంది నుండి నమూనాలు సేకరిస్తామని తెలిపారు.వైద్య ఆరోగ్య శాఖ ఆదేశాల మేరకు తాము పంపిన ప్రతిపాదనలు పరిగణనలోనికి తీసుకుని పరిశోధనకు ఐసీఎంఆర్ ఆమోదం తెలిపిందన్నారు.శాస్త్రీయ విధానంలో 18 ఏళ్లకు పైబడిన వారి నమూనాలు సేకరిస్తామని ఆధునిక బయోమార్కర్స్ విధానంలో పరీక్షిస్తామన్నారు. దీనివల్ల బాధితులకు ఒకటి, రెండు సంవత్సరాల్లో కిడ్నీ సమస్య ఏ స్థాయిలో రావచ్చున్నది స్పష్టంగా తెలుస్తుందన్నారు. ఆర్ఎన్ఏ సీక్వెన్సింగ్ విధానంలో జన్యుపరమైన పరీక్షలు కూడా ఈ పరిశోధనలో భాగంగా చేస్తామని తెలిపారు. దీనివల్ల బాధితులకు జన్యుపరంగా కిడ్నీ వ్యాధులు వస్తాయా? రావా? అని కూడా తెలుస్తుందని పేర్కొన్నారు. ఉద్దానంలోని వేరువేరు ప్రాంతాల్లో మట్టి, నీరు, గాలి, వరి, చేపలు, కూరగాయల నమూనాలు సేకరించి కూడా పరీక్షిస్తామని. వీటి ఫలితాల.ననుసరించి తదుపరి చర్యలు ఉంటాయని డాక్టర్ రవిరాజు పేర్కొన్నారు. ఈ సమావేశంలో కేజీహెచ్ కిడ్నీ వ్యాధుల విభాగాదిపతి డాక్టర్ జి. ప్రసాద్, ఆంధ్ర వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సంధ్యారాణి,వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.

