శాస్త్రీయ ఆలోచనలను ప్రోత్సహించుతూ, “చిల్లంగులు చేతబడులు మూఢనమ్మకాలు – మూఢనమ్మకాలు విడనాడండి, శాస్త్రీయ సమాజాన్ని నిర్మిద్దాం, పర్యావరణాన్ని కాపాడుకుందాం” అనే నినాదాలతో జన విజ్ఞాన వేదిక (జెవివి) శ్రీకాకుళం జిల్లా మహాసభలు ఆదివారం యుటిఎఫ్ భవనంలో ఘనంగా జరిగాయి.ముఖ్య అతిథుల ప్రసంగంజెవివి రాష్ట్ర నాయకులు, ఆల్ ఇండియా పీపుల్స్ సైన్స్ నెట్వర్క్ జాతీయ కమిటీ సభ్యులు జి. మురళీధర్ మాట్లాడుతూ – దేశవ్యాప్తంగా పెరుగుతున్న మూఢనమ్మకాలు, మతతత్వాలను శాస్త్రీయ విద్య ద్వారానే తగ్గించవచ్చని చెప్పారు. రాజ్యాంగ లక్ష్యాల సాధనకు ప్రజలను చైతన్యం చేయాలని పిలుపునిచ్చారు.సీనియర్ నాయకులు కొత్తకోట అప్పారావు, బొడ్డేపల్లి మోహన్ రావు మాట్లాడుతూ – చెకుముకి సైన్స్ సంబరాలు, యూరేకా సైన్స్ ఎక్స్పోలు, శాస్త్రీయ దృక్పథ క్యాంపెయిన్ల ద్వారా విద్యార్థుల్లో శాస్త్రీయ ఆలోచన పెంపొందించడమే జెవివి లక్ష్యమని తెలిపారు.జిల్లా నాయకుల అభిప్రాయాలుజిల్లా అధ్యక్షుడు కుప్పిలి కామేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి గొంటి గిరిధర్ మాట్లాడుతూ – చిల్లంగులు చేతబడులు అనే పేరుతో హత్యలు జరగడం దారుణం. ఇవి శాస్త్రీయ ఆధారంలేని మూఢనమ్మకాలని ప్రజల్లో చైతన్యం కలిగించాలి అన్నారు.సభలో ఆమోదించిన తీర్మానాలువిద్యా, ఆరోగ్య రంగాలు ప్రభుత్వ ఆధీనంలోనే ఉండాలి.వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు కల్పించాలి.ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు చేయరాదు.పర్యావరణానికి ప్రమాదం కలిగించే అణు, థర్మల్ విద్యుత్ కేంద్రాలు నిర్మించరాదు.కొత్త జిల్లా కమిటీ ఎన్నికమహాసభలో కొత్త జిల్లా కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.జిల్లా అధ్యక్షుడు: గొంటి గిరిధర్ జిల్లా ప్రధాన కార్యదర్శి: కుప్పిలి కామేశ్వరరావు జిల్లా పాట్రన్: కొత్తకోట అప్పారావుజిల్లా గౌరవాధ్యక్షులు: బొడ్డేపల్లి జనార్ధనరావు, సాయి శ్రీనివాస శర్మ, బొడ్డేపల్లి మోహన్ రావు ఉపాధ్యక్షులు: ఎన్ కుమార్ స్వామి, ఎం వాగ్దేవి, పి కూర్మా రావు, ఎస్ సంజీవరావు కోశాధికారి: వి.ఎస్. కుమార్ ఇకపైన సైన్స్ & కమ్యూనికేషన్, ఎడ్యుకేషన్, పర్యావరణం, ఆరోగ్యం, యువజన విభాగం, సోషల్ మీడియా, సాంస్కృతిక విభాగాలకు కన్వీనర్లను కూడా ఎన్నుకున్నారు.
ఈ మహాసభల్లో 62 మంది వివిధ ఫోరంల నాయకులు పాల్గొని చర్చలు జరిపారు. శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడమే కాకుండా, పర్యావరణ పరిరక్షణ, సమాజంలో మూఢనమ్మకాల నిర్మూలనకే జెవివి ప్రధాన లక్ష్యమని ప్రతినిధులు స్పష్టం చేశారు.

