Thursday, 5 February 2026
  • Home  
  • శ్మశాన వాటికను అద్భుతంగా పునరుదరిస్తాం.
- చిత్తూరు

శ్మశాన వాటికను అద్భుతంగా పునరుదరిస్తాం.

శ్మశాన వాటికను అద్భుతంగా పునరుదరిస్తాం…!)స్మశానo మరింత అభివృద్ధికి అక్కడే ఏర్పాటైన సమావేశాలు!!) విరివిరిగా విరాళాలు అందిస్తున్న గాండ్ల కులస్తులు స్మశానం..ఈ పదం వినగానే ఒక లాంటి నిర్లిప్తత…..ఏదో తెలియని భయం ఆవహిస్తుంది ఎవరికైనా ….. రాత్రి మాత్రమే కాదు, పగలు కూడా అటువైపుగా వెళ్లేందుకు ఎవరూ సాహసించారు. ఊరికి దూరంగా విసిరేసినట్లుగా ఉండే స్మశానాలకు తప్పనిసరి పరిస్థితులో వెళ్లాల్సివస్తే…… చనిపోయిన వారు కైలాసానికో.. వైకుంఠానికో… వెళుతారో లేదో కాని దహన సంస్కారాలకు వెళ్ళిన వారు మాత్రం కాస్తా వణకడం ఖాయం. అంత్య క్రియలకు ఆరు గజాల స్థలం సంపాదించడం దగ్గరి నుంచి…..మృత దేహాన్ని ఖననం చేసేదాకా..కాటి కష్టాలు అన్నీ ఇన్నీ కావు. స్మశాన వైరాగ్యం…..అంటే ఏమిటో అందరికీ తెలుస్తోంది. అందుకే అక్కడికి మహిళలని, పిల్లలని అనుమతించరు. నిజానికి చివరి మజిలీలు ఇంత భయంకరంగా వుండాలా? స్మశానం వల్లకాడులా…..కనీస సౌకర్యాల లేమితో స్మశానములు ఎందుకుండాలి? మన ఆప్తులను మురికి కూపంగా వున్న స్థలంలో ఖననం చేసే ఖర్మ మనకేమిటి? ఈ ప్రశ్నలకు జవాబులుగా చెప్పాలనే… ఓ మంచి ఆలోచనలతో బృహత్తర ప్రణాళికలతో  పలమనేరు పట్టణ మందలి పాతపేట హిందూ స్మశాన వాటికగా వున్న స్థలంలో అత్యధ్బుతంగా అభివృద్ధి పరచాలనే పట్టణ పెద్దలు, ప్రధానoగా గాండ్ల కుల పెద్దలు నిర్ణయించి గత డిసెంబర్ నెలలో 14 వ తేదీ నుంచి 28వ తేదీ వరకూ మూడు పర్యాయాలు స్మశాన వాటిక స్థలం లోనే ప్రత్యేక శ్రద్ధతో పట్టణ గాండ్ల కుల పెద్దలు చంద్ర అనే బాలకృష్ణ,అమరేంద్ర బాబు, వ్యాపారవేత్త బాబుల ఆద్వర్యంలో సభ్యులు సమావేశమయ్యారు. మెండైన బ్రహ్మణుడు మెట్టుభూమి ఒకటే.. చండాలుండేటి మరుభూమి ఒకటే.. అంటూ మరణించిన తర్వాత మనిషి ఎక్కడికి చేరతాడో ? అన్నమయ్య తన కీర్తనలలో వినిపించారు. అయితే ఆ మరుభూమి అందమైన మొక్కలతో, పచ్చిక బయళ్లతో, రహదారులతో,చూడచక్కని కట్టడాలతో.. ఉంటే మన మనిషిని గౌరవంగా సాగనంపినట్టుగా ఉంటుందనే ఆలోచనలతో ఇటీవలి కాలంలో కొన్ని నగరాలు,పట్టణాలలో స్మశాన వాటికలు రూపుదిద్దుకుంటున్నాయి.అలాంటి కోవలోకి మార్చాలని వీరు భావిస్తున్నారు. *పట్టణ, గాండ్ల పెద్దల నిర్ణయం* పట్టణాల్లో స్మశానాలను బృందావనంలా తీర్చిదిద్దుతున్నారు. అలాంటి స్మశాన వాటికలను పోలినట్లుగా ఉండాలని, ఒక ఎకరo పైగా విస్తీర్ణంలో గల స్మశాన వాటికను ఆదర్శంగా ఏర్పాటు చేయడంలో భాగంగా అందులో హరిచంద్రుని ఆలయం,అంతిమ సంస్కారం చేసే బంధువులకు ఓ బృందావనo లాంటి అనుభూతి కలిగించేలా మార్చి పుష్కలమైన నీటి సౌకర్యములతో రెండు రూముల నిర్మాణం,ఫ్రీజర్ బాక్స్,వాహనంలో మృతదేహాన్ని తరలించేందుకు తక్కువ ఖర్చుతో ప్రత్యేక వాహనం ఏర్పాటు వంటి సౌకర్యాలు అందించి అక్కడి నిర్వహణ కోసం అభివృద్ధి కమిటీని వేయనున్నట్లు నిర్ణయం తీసుకున్నారు.ఇలా గత రెండు వారాలుగా స్మశాన వాటిక పునరుద్ధరణ పనులు కార్యరూపం దాల్చి వేగవంతంగా పారదర్శకతతో జరుగుతున్నాయి.ఇందుకోసం గాండ్ల కులస్తులు స్వచ్ఛందంగా దాతల రూపంలో ముందుకు వచ్చి ఆర్థికoగా ఆదుకుంటుండగా,కొన్ని నిర్మాణ పనులు దాతలే చేపడుతూ ఆనందిస్తున్నారు.మరింత మంది చందాలు ఇచ్చి ఆదుకోవాలని సంఘం పెద్దలు కోరారు. *సొంత ఇంటి పనులలా పర్యవేక్షణ* కాగా తమ సొంత ఇంటి నూతన నిర్మాణ పనులను చూస్తున్నట్లు నిత్యం స్మశాన వాటికలోనే కుర్చీలు వేసుకొని ఇక్కడి గాండ్ల కులస్తులు పర్యవేక్షణ చేయడం విశేషం. పెద్దలు చంద్ర,అమరేంద్ర బాబు, వ్యాపారవేత్త బాబుల ఆలోచనలకు అనుగుణంగా మునిసిపల్ కౌన్సిలర్ కోదండరామయ్య,ఏ.ఆర్.కుమార్, మూర్తి,టి.ప్రకాశ్ బాబు, కృష్ణమూర్తి,శ్రీధర్ బాబు, కేశవులు,జె.సి.రవి,ఆర్.కె.రమేష్ కుటుంబం,రాజేశ్, కె.వి.శ్రీనాథ్ తదితరులు కార్యనిర్వాహకులుగా వ్యవహరిస్తున్నారు.

శ్మశాన వాటికను అద్భుతంగా పునరుదరిస్తాం…
!)స్మశానo మరింత అభివృద్ధికి అక్కడే ఏర్పాటైన సమావేశాలు
!!) విరివిరిగా విరాళాలు అందిస్తున్న గాండ్ల కులస్తులు

స్మశానం..ఈ పదం వినగానే ఒక లాంటి నిర్లిప్తత…..ఏదో తెలియని భయం ఆవహిస్తుంది ఎవరికైనా ….. రాత్రి మాత్రమే కాదు, పగలు కూడా అటువైపుగా వెళ్లేందుకు ఎవరూ సాహసించారు. ఊరికి దూరంగా విసిరేసినట్లుగా ఉండే స్మశానాలకు తప్పనిసరి పరిస్థితులో వెళ్లాల్సివస్తే…… చనిపోయిన వారు కైలాసానికో.. వైకుంఠానికో… వెళుతారో లేదో కాని దహన సంస్కారాలకు వెళ్ళిన వారు మాత్రం కాస్తా వణకడం ఖాయం. అంత్య క్రియలకు ఆరు గజాల స్థలం సంపాదించడం దగ్గరి నుంచి…..మృత దేహాన్ని ఖననం చేసేదాకా..కాటి కష్టాలు అన్నీ ఇన్నీ కావు. స్మశాన వైరాగ్యం…..అంటే ఏమిటో అందరికీ తెలుస్తోంది. అందుకే అక్కడికి మహిళలని, పిల్లలని అనుమతించరు. నిజానికి చివరి మజిలీలు ఇంత భయంకరంగా వుండాలా? స్మశానం వల్లకాడులా…..కనీస సౌకర్యాల లేమితో స్మశానములు ఎందుకుండాలి? మన ఆప్తులను మురికి కూపంగా వున్న స్థలంలో ఖననం చేసే ఖర్మ మనకేమిటి? ఈ ప్రశ్నలకు జవాబులుగా చెప్పాలనే… ఓ మంచి ఆలోచనలతో బృహత్తర ప్రణాళికలతో  పలమనేరు పట్టణ మందలి పాతపేట హిందూ స్మశాన వాటికగా వున్న స్థలంలో అత్యధ్బుతంగా అభివృద్ధి పరచాలనే పట్టణ పెద్దలు, ప్రధానoగా గాండ్ల కుల పెద్దలు నిర్ణయించి గత డిసెంబర్ నెలలో 14 వ తేదీ నుంచి 28వ తేదీ వరకూ మూడు పర్యాయాలు స్మశాన వాటిక స్థలం లోనే ప్రత్యేక శ్రద్ధతో పట్టణ గాండ్ల కుల పెద్దలు చంద్ర అనే బాలకృష్ణ,అమరేంద్ర బాబు, వ్యాపారవేత్త బాబుల ఆద్వర్యంలో సభ్యులు సమావేశమయ్యారు.

మెండైన బ్రహ్మణుడు మెట్టుభూమి ఒకటే.. చండాలుండేటి మరుభూమి ఒకటే.. అంటూ మరణించిన తర్వాత మనిషి ఎక్కడికి చేరతాడో ? అన్నమయ్య తన కీర్తనలలో వినిపించారు. అయితే ఆ మరుభూమి అందమైన మొక్కలతో, పచ్చిక బయళ్లతో, రహదారులతో,చూడచక్కని కట్టడాలతో.. ఉంటే మన మనిషిని గౌరవంగా సాగనంపినట్టుగా ఉంటుందనే ఆలోచనలతో ఇటీవలి కాలంలో కొన్ని నగరాలు,పట్టణాలలో స్మశాన వాటికలు రూపుదిద్దుకుంటున్నాయి.అలాంటి కోవలోకి మార్చాలని వీరు భావిస్తున్నారు.

*పట్టణ, గాండ్ల పెద్దల నిర్ణయం*

పట్టణాల్లో స్మశానాలను బృందావనంలా తీర్చిదిద్దుతున్నారు. అలాంటి స్మశాన వాటికలను పోలినట్లుగా ఉండాలని, ఒక ఎకరo పైగా విస్తీర్ణంలో గల స్మశాన వాటికను ఆదర్శంగా ఏర్పాటు చేయడంలో భాగంగా అందులో హరిచంద్రుని ఆలయం,అంతిమ సంస్కారం చేసే బంధువులకు ఓ బృందావనo లాంటి అనుభూతి కలిగించేలా మార్చి పుష్కలమైన నీటి సౌకర్యములతో రెండు రూముల నిర్మాణం,ఫ్రీజర్ బాక్స్,వాహనంలో మృతదేహాన్ని తరలించేందుకు తక్కువ ఖర్చుతో ప్రత్యేక వాహనం ఏర్పాటు వంటి సౌకర్యాలు అందించి అక్కడి నిర్వహణ కోసం అభివృద్ధి కమిటీని వేయనున్నట్లు నిర్ణయం తీసుకున్నారు.ఇలా గత రెండు వారాలుగా స్మశాన వాటిక పునరుద్ధరణ పనులు కార్యరూపం దాల్చి వేగవంతంగా పారదర్శకతతో జరుగుతున్నాయి.ఇందుకోసం గాండ్ల కులస్తులు స్వచ్ఛందంగా దాతల రూపంలో ముందుకు వచ్చి ఆర్థికoగా ఆదుకుంటుండగా,కొన్ని నిర్మాణ పనులు దాతలే చేపడుతూ ఆనందిస్తున్నారు.మరింత మంది చందాలు ఇచ్చి ఆదుకోవాలని సంఘం పెద్దలు కోరారు.

*సొంత ఇంటి పనులలా పర్యవేక్షణ*

కాగా తమ సొంత ఇంటి నూతన నిర్మాణ పనులను చూస్తున్నట్లు నిత్యం స్మశాన వాటికలోనే కుర్చీలు వేసుకొని ఇక్కడి గాండ్ల కులస్తులు పర్యవేక్షణ చేయడం విశేషం. పెద్దలు చంద్ర,అమరేంద్ర బాబు, వ్యాపారవేత్త బాబుల ఆలోచనలకు అనుగుణంగా మునిసిపల్ కౌన్సిలర్ కోదండరామయ్య,ఏ.ఆర్.కుమార్, మూర్తి,టి.ప్రకాశ్ బాబు, కృష్ణమూర్తి,శ్రీధర్ బాబు, కేశవులు,జె.సి.రవి,ఆర్.కె.రమేష్ కుటుంబం,రాజేశ్, కె.వి.శ్రీనాథ్ తదితరులు కార్యనిర్వాహకులుగా వ్యవహరిస్తున్నారు.

5 Comments

  1. Velluru Nagaraju

    January 4, 2026

    Super

    • M S SUDARSHAN

      January 4, 2026

      ధన్యవాదములు 🙏🙏🙏

  2. A R kumar

    January 4, 2026

    Super News…Public purpose News…

  3. A R kumar

    January 4, 2026

    చాలా మంచి వార్త పెట్టారు.సమాజానికి ఉపయోగపడే వార్త.సామాజిక సేవ చేస్తున్నవారికి కూడా ధన్యవాదాలు.

    • M S SUDARSHAN

      January 4, 2026

      ధన్యవాదములు 🙏🙏🙏

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.