జడ్పిటిసి అభ్యర్థి ఎన్ని శ్రీనివాసరావు పసుపుమయంగా మారిన శోంఠ్యం!
=====================================================
విశాఖపట్నం జిల్లా, ఆనందపురం, (పున్నమి ప్రతినిధి) నవంబర్ 1 ::**
శోంఠ్యం పంచాయతీ పరిధిలో కూటమి ఆధ్వర్యంలో నిర్వహించిన మహా ర్యాలీ రాజకీయ సందడి సృష్టించింది. కూటమి ఎంపీటీసీ అభ్యర్థి **గొంతిన కనకరాజు** కు మద్దతుగా ఏర్పాటు చేసిన ఈ భారీ ర్యాలీతో గ్రామంలో ఎన్నికల వాతావరణం మరింత వేడెక్కింది.
పసుపు జెండాలు రెపరెపలాడుతుండగా, సైకిల్ గుర్తుతో కూటమి శ్రేణులు ఉత్సాహంగా ర్యాలీలో పాల్గొన్నారు. గ్రామ వీధుల గుండా సాగిన ర్యాలీలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని తమ మద్దతును చాటుకున్నారు. ఎంపీటీసీ అభ్యర్థిగా తనకు సైకిల్ గుర్తుపైన జడ్పిటిసి అభ్యర్థి ఎన్ని శ్రీనివాసరావు గారికి గాజు గ్లాస్ గుర్తుపైన ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాల్సిందిగా ప్రజలను కోరారు
**అభివృద్ధే లక్ష్యం.. ప్రజా సంక్షేమమే ధ్యేయం!**
ప్రజల సమస్యలను తెలుసుకుంటూ, గ్రామ అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తామని కూటమి నాయకులు పేర్కొన్నారు. ఎంపీటీసీ అభ్యర్థి గొంతిన కనకరాజుకు మద్దతుగా నిర్వహించిన ఈ ర్యాలీ స్థానిక రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
**ఒకవైపు కూటమి శ్రేణుల ఉత్సాహం.. మరోవైపు ఓటర్ల ఆసక్తి.. శోంఠ్యం ఎన్నికల పోరు రోజురోజుకూ రసవత్తరంగా మారుతోంది!**
శోంఠ్యం రాజకీయాల్లో మహా ర్యాలీతో కూటమి జోష్.. ఎన్నికల బరిలో గొంతిన కనకరాజు దూకుడు!





News Sources
- Punnami ReportingOwn reporting