కలిగిరి మండలం తెల్లపాడు గ్రామంలో శ్రీ సీతారాముల స్వామివారి బ్రహ్మోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా నిర్వహించిన శేష వాహన సేవలో ఎమ్మెల్యే పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తుల హర్షధ్వానాల మధ్య జరిగిన ఈ కార్యక్రమం ఆధ్యాత్మిక వాతావరణాన్ని మరింత మెరుగు పరిచింది.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. రైతులు పాడిపంటలతో సుభిక్షంగా ఉండాలని, సమయానికి వర్షాలు కురవాలని స్వామివారిని ప్రార్థించారు. ప్రజలందరూ సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షిస్తూ ఆశీస్సులు కోరుకున్నారు.



