చిట్వేలి ఆగస్టు పున్నమి ప్రతినిధి
ఉమ్మడి కడప జిల్లా చిట్వేలి శేషాచలం అడవుల్లో పెద్దపులి దర్శనమిచ్చింది. ఇటీవల రేంజ్ అధికారులు ఏర్పాటు చేసిన 30 ట్రాప్ కెమెరాల్లో పగలు, రాత్రి పులుల సంచారం రికార్డు అయ్యింది. రెండు నుంచి మూడు పులులు ఈ ప్రాంతంలో తిరుగుతున్నాయని అటవీ అధికారులు చెబుతున్నారు. ఇవి శ్రీశైలం టైగర్ ప్రాజెక్ట్ నుంచి నల్లమల–శేషాచలం కారిడార్ ద్వారా వచ్చి ఉండవచ్చని భావిస్తున్నారు. దీంతో ఈ అడవుల్లో పులుల సంచారం పెరిగే అవకాశముందని అంచనా.


