వివరాలు:
గుంటూరులో జరిగిన APBSSS రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు కార్యక్రమంలో ప్రముఖ విద్యావేత్త డా. మంజుల గుదిమెళ్ళ గారు ఉత్తమ ఉపాధ్యాయురాలిగా అవార్డును అందుకున్నారు. విద్యారంగంలో వారు అందించిన విశేష సేవలు, విద్యార్థుల వ్యక్తిత్వ వికాసం కోసం చేసిన కృషి ఈ అవార్డు సాధనకు కారణమయ్యాయి.
ఈ సందర్భంగా డా. మంజుల గారు మాట్లాడుతూ – “ఈ అవార్డు నాకు మరింత బాధ్యతను కలిగించింది. విద్యార్థుల భవిష్యత్ కోసం మరింత కృషి చేస్తాను” అని తెలిపారు.
కార్యక్రమానికి రాష్ట్రవ్యాప్తంగా పలువురు విద్యావేత్తలు, అధికారులు, ప్రముఖులు హాజరై డా. మంజుల గారికి శుభాకాంక్షలు తెలిపారు. గుంటూరు నగరంలో జరిగిన ఈ అవార్డు కార్యక్రమం ఘనంగా సాగింది.


