రైల్వేకోడూరు అక్టోబర్ పున్నమి ప్రతినిధి
రైల్వేకోడూరు స్థానిక శివాలయంలో ఈరోజు వేకువ జాము నుండి శివాలయంలో శివనామ స్మరణ మారు మ్రోగినది అంతేకాకుండా భక్తులు ప్రత్యేకంగా స్త్రీలు వేకువ జామున శివుడిని దర్శించుకుని ఆ తరువాత కార్తీక పౌర్ణమి నీ పురస్కరించుకొని కార్తీక దీపం పెట్టడం జరిగినది .కార్తీకమాసంలో శివుడికి అతి పవిత్రమైన మాసం కార్తీక మాసం అందువలన స్త్రీలు ప్రత్యేకంగా స్వామి వారిని దర్శించుకోవడం జరుగుతుందని ఆలయ అర్చకులు పవన్ కుమార్ శర్మ యోగీశ్వర శర్మ తెలపడం జరిగినది. కార్తీకదీపం అనంతరం అమ్మవార్లకు ప్రత్యేకమైన అలంకారంతో పూజలు చేయడం జరిగిందని వారు తెలిపారు. పూజానంతరం అల్పాహారం 1500 మందికి షేక్ షంషీద్ భాష వచ్చిన భక్తులకు ఏర్పాటు చేయడం జరిగినదని తెలిపారు.


