పట్టణ శివారులోని ముత్తగూడెం పెట్రోల్ బంక్ ఎదురుగా ఒక కారు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో భార్యాభర్తలు గాయపడినట్లు సమాచారం. రోడ్డుపై అకస్మాత్తుగా అడ్డంగా వచ్చిన గేదెను తప్పించబోయే క్రమంలో కారు డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో ఈ ఘటన జరిగింది. కారు భద్రాచలానికి చెందినదిగా గుర్తించారు. కారులో ప్రయాణిస్తున్న భార్యాభర్తలు ప్రమాదంలో గాయపడ్డారు.
జరిగిన వెంటనే స్థానికులు వారిని రక్షించి, తిరువూరులోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేర్చారు.
ప్రస్తుతం క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితి, పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
శివారులో కారు బోల్తా ..గేదెను తప్పించబోయి అదుపు తప్పిన కారు: భార్యాభర్తలకు గాయాలు
పట్టణ శివారులోని ముత్తగూడెం పెట్రోల్ బంక్ ఎదురుగా ఒక కారు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో భార్యాభర్తలు గాయపడినట్లు సమాచారం. రోడ్డుపై అకస్మాత్తుగా అడ్డంగా వచ్చిన గేదెను తప్పించబోయే క్రమంలో కారు డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో ఈ ఘటన జరిగింది. కారు భద్రాచలానికి చెందినదిగా గుర్తించారు. కారులో ప్రయాణిస్తున్న భార్యాభర్తలు ప్రమాదంలో గాయపడ్డారు. జరిగిన వెంటనే స్థానికులు వారిని రక్షించి, తిరువూరులోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేర్చారు. ప్రస్తుతం క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితి, పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

